Team India: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ప్రాక్టీస్‌లో గాయపడిన టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌కు డౌటే?

Suryakumar Yadav Hand Injury: టీ20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు ప్రదర్శన ఇప్పటి వరకు అద్భుతంగా ఉంది.

Update: 2024-06-18 04:39 GMT

Team India: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ప్రాక్టీస్‌లో గాయపడిన టీమిండియా స్టార్ ప్లేయర్.. ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌కు డౌటే?

Suryakumar Yadav Hand Injury: టీ20 ప్రపంచ కప్ 2024లో భారత జట్టు ప్రదర్శన ఇప్పటి వరకు అద్భుతంగా ఉంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు ఆడగా మూడింటిలో విజయం సాధించగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో సూపర్ 8లో టీమ్ ఇండియా సులువుగా చోటు దక్కించుకుంది. ఇప్పుడు సూపర్ 8 దశలో భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొట్టనుంది. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాతోపాటు ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ అందింది. మిస్టర్ 360 ప్లేయర్ గాయపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో సూపర్ 8 తొలి మ్యాచ్‌లో ఆడతాడా లేదా అనేది సందేహంగా మారింది.

ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడిన సూర్యకుమార్ యాదవ్..

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ 2024లో సూపర్ 8 దశ మొదలుకానుంది. ఈ క్రమంలో భారత జట్టు జూన్ 20న ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడేందుకు సిద్ధమైంది. వెస్టిండీస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. దీని కోసం భారత జట్టు ఇప్పటికే ఇక్కడకు చేరుకుంది. మెన్ ఇన్ బ్లూ సోమవారం తొలి ప్రాక్టీస్ సెషన్‌లో బిజీగా కనిపించారు.

కాగా, మీడియా కథనాల ప్రకారం, స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు. త్రో డౌన్‌కు వ్యతిరేకంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, ఒక బంతి సూర్య కుడి చేతికి తగిలింది. దాని కారణంగా అతను తన ప్రాక్టీస్‌ను ఆపవలసి వచ్చింది. అయితే, గాయం పెద్దగా లేదని అంటున్నారు. మ్యాజిక్ స్ప్రే ఉపయోగించి, సూర్య మళ్లీ తన ప్రాక్టీస్ ప్రారంభించాడంట.

ఇప్పటి వరకు టోర్నీలో సూర్య బ్యాట్ నిశబ్దంగా ఉండడంతో పాటు మూడు మ్యాచ్ ల్లో 59 పరుగులు చేశాడు. USAపై అతను చేసిన అత్యధిక స్కోరు 50* అత్యధికంగా మారింది. సూర్య త్వరలో టోర్నీలో తన లయను పుంజుకుంటాడని, అతని బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

సూపర్ 8లో టీమ్ ఇండియా..

సూపర్ 8లోకి ప్రవేశించిన ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్థాన్‌లతో కూడిన గ్రూప్‌-1లో భారత్‌కు చోటు దక్కింది. మరోవైపు గ్రూప్ 2లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, అమెరికా ఉన్నాయి. సూపర్ 8 దశ ముగిసే సమయానికి, రెండు గ్రూపుల్లోని టాప్ 2 జట్లు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి.


Tags:    

Similar News