సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి లంకేయులు కకావికలం

Update: 2019-06-28 12:18 GMT

దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి శ్రీలంక జట్టు కాకావికలం అయిపోయింది. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచీ.. శ్రీలంకను ముప్పుతిప్పలు పెట్టిన సౌతాఫ్రికా బౌలర్లు 35 వ ఓవర్ వచ్చేసరికి ఐదు వికెట్లు సాధించి మ్యాచ్ పై పట్టు బిగించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ.. పదిహేనో ఓవర్ నుంచి పొదుపుగా పరుగులు ఇస్తూ కీలకమైన వికెట్లను పడగొట్టారు. 12 ఓవర్లో మూడో వికెట్ కోల్పయిన తరువాత కుశాల్‌ మెండిస్‌, ఏంజిలో మాథ్యూస్‌ శ్రీలంక బ్యాటింగ్ గాడిలో పెట్టాలని ప్రయత్నించారు. నెమ్మదిగా పరుగులు చేస్తూ, వికెట్లు కాపాడుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు. దక్షిణాఫ్రికా బౌలర్‌ ప్రిటోరియస్‌ కట్టుదిట్టంగా బంతులేయడంతో సింగిల్స్ చేయడానికి కూడా శ్రీలంక బ్యాట్స్ మెన్ కు అవకాశం దక్కలేదు. దక్షిణాఫ్రికా మ్యాచ్‌పై పట్టు సాధిస్తుండడంతో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ పూర్తి ఆత్మరక్షణలో పడ్డారు. 21వ ఓవర్లో శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. సీనియర్‌ ఆటగాడు ఏంజిలో మాథ్యూస్‌(11; 29 బంతుల్లో) క్రిస్‌మోరిస్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దీంతో ఆ జట్టు వంద పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో మరింత నెమ్మదించింది శ్రీలంక. ప్రిటోరియస్‌ వేసిన 28 వ మెయిడిన్‌ వికెట్‌గా నమోదైంది. కుశాల్‌ మెండిస్‌(23;51 బంతుల్లో) తొలి బంతికే ఔటయ్యాడు. దీంతో ఐదు వికెట్లు కోల్పోయి లంకేయులు విలవిల లాడారు. జేపీ డుమిని వేసిన 37వ ఓవర్‌ తొలి బంతికి ధనంజయ డిసిల్వ (24;41 బంతుల్లో) బౌల్డయ్యాడు. దీంతో లంక 135 పరుగుల వద్ద ఆరో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం శ్రీలంక జట్టు 37 ఒవర్లకి ఆరు వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేసింది. మెండిస్(4), పెరీరా(2) క్రీజులో ఉన్నారు.

Tags:    

Similar News