వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో శ్రీలంక జట్టు ఆఫ్ఘానిస్తాన్ పై 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 36.5 ఓవర్లకు 201 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వర్షం కారణంగా దాదాపు రెండున్నర గంటలపాటు ఆట నిలిచిపోయింది. దాంతో ఆఫ్ఘనిస్థాన్ విజయ లక్ష్యాన్ని 41 ఓవర్లకు 187 పరుగులుగా నిర్ణయించారు.
తరువాత బ్యాటింగ్ మొదలు పెట్టిన ఆఫ్ఘనిస్థాన్ క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోతూ వచ్చింది. నజీబుల్లా ఒక్కడూ ఒంటరి పోరాటం చేసినా ఆ జట్టు ఓటమిని తప్పించుకోలేక పోయింది. 33 . 4 ఓవర్లలో 152 పరుగులు మాత్రమేచేసి ఓటమి పాలైంది.