Sri Lanka Cricketer Kusal Mendis Arrested: శ్రీలంక యువ క్రికెటర్ కుశాల్ మెండిస్ అరెస్టు
Sri Lanka Cricketer Kusal Mendis Arrested: శ్రీలంక యువ క్రికెటర్ కుశాల్ మెండిస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొలంబో లోని పనదురాలో ఆదివారం ఉదయం సైకిల్‌పై వెళ్తున్న 64 ఏళ్ల వృద్ధుడిని మెండిస్ కారుతో ఢీకొట్టాడు.
Sri Lanka Cricketer Kusal Mendis Arrested: శ్రీలంక యువ క్రికెటర్ కుశాల్ మెండిస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొలంబో లోని పనదురాలో ఆదివారం ఉదయం సైకిల్‌పై వెళ్తున్న 64 ఏళ్ల వృద్ధుడిని మెండిస్ కారుతో ఢీకొట్టాడు.. దాంతో ఆ వృద్ధుడు మరణించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు మెండిస్‌ను అరెస్టు చేశారు. మెండిస్‌ను కుదిరితే ఈరోజు లేదంటే రేపు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. మెండిస్ , మృతుడు ఎవరైనా మద్యం మత్తులో ఉన్నారా లేదా అనేది ఇంకా నిర్ధారించబడలేదు.
25 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ శ్రీలంక తరఫున 44 టెస్టులు, 76 వన్డేలు, 26 టీ 20 లు ఆడారు. టెస్టుల్లో 36.97 సగటుతో 2995 పరుగులు, వన్డేల్లో 30.52 సగటుతో 2167 పరుగులు చేశాడు. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న శ్రీలంక క్రికెట్‌కు మెండిస్ అరెస్ట్ మరో భారీ దెబ్బ అని చెప్పాలి. 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ లో భారతదేశం గెలిచింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ను శ్రీలంకలో "కొన్ని పార్టీలు" నిర్ణయించాయని శ్రీలంక మాజీ క్రీడా మంత్రి మహీందానంద అలుత్‌గమాగే ఆరోపించారు. కాగా కరోనా లాక్‌డౌన్ తర్వాత ట్రెయినింగ్‌ను స్టార్ట్ చేసిన లంక స్క్వాడ్‌లో కుశాల్ కూడా ఉన్నాడు. కోవిడ్ కారణంగా ఇండియా టూర్‌తోపాటు శ్రీలంక ఆడాల్సిన మిగతా సిరీస్‌లు కూడా రద్దయ్యాయి.