India Vs Sri Lanka 2021: భారత్ శ్రీలంక మధ్య మంగళవారం జరిగిన రెండో వన్డే గెలుపు అంచుల వరకు వెళ్ళిన శ్రీలంక దీపక్ చహర్, భువనేశ్వర్ కుమార్ ల అద్భుత భాగసౌమ్యంతో భారత్ చివరి 5 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి శ్రీలంక గెలుపు ఆశలపై నీళ్ళు చల్లింది. అయితే 277 లక్ష్య చేధనలో బరిలోకి దిగిన భారత్ 193 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి అంచుల్లో ఉన్న భారత్ గెలవడంతో శ్రీలంక టీం కోచ్ మిక్కి ఆర్థూర్ తన అసహనాన్ని, కోపాన్ని లంక కెప్టెన్ దసున్ షనాకపై మైదానంలో చూపించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. చివర్లో లంక ఆటగాళ్ళ చెత్త ప్రదర్శన వల్లనే ఓడిపోవాల్సి వచ్చిందని గ్రౌండ్ లోనే కెప్టెన్ తో కోచ్ మిక్కి ఆర్థూర్ దురుసుగా ప్రవర్తించడంతో అటు లంక జట్టు ఆటగాళ్ళు కూడా కోచ్ ప్రవర్తనతో కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.
గతంలో కూడా పాకిస్తాన్ జట్టుకి కోచ్ గా పనిచేసిన మిక్కి ఆర్థూర్ తన ఆవేశపూరిత ప్రవర్తన వల్ల కోచ్ పదవి నుండి తొలగింపబడ్డాడు. తాజాగా శ్రీలంక టీంతో కూడా అదే విధంగా తన కోపాన్ని చూపడంతో లంక జట్టు యాజమాన్యం కూడా మిక్కి ఆర్థూర్ ను ఈ సిరీస్ తర్వాత పక్కనపెట్టబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక మూడు వన్డేల సిరీస్ లో భారత్ ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. ఇక నామమాత్రపు శ్రీలంక - భారత్ మూడో వన్డే ఈ శుక్రవారం జరగనుంది. మూడో వన్డేలోనైన గెలిచి పరువు నిలబెట్టుకోవాలని లంక ఆటగాళ్ళు చూస్తుండగా, మరోపక్క చివరి వన్డేలో గెలిచి లంకని వైట్ వాష్ చేయాలనీ భారత్ జట్టు తహతహలాడుతుంది.