అతడికి 20 ఏళ్ళే అలాంటి కథనాలు రాస్తారా.. క్రికెట్ ఆస్వాదించండి చాలు
టీమిండియా ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో కొన్ని మ్యాచుల్లో విఫలమైతే ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించాలనే అభిప్రాయానికి రావడం ఎంతవరకూ సరైందని ప్రశ్నించాడు.
టీమిండియా ఓపెనర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్లో కొన్ని మ్యాచుల్లో విఫలమైతే ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించాలనే అభిప్రాయానికి రావడం ఎంతవరకూ సరైందని ప్రశ్నించాడు. ఇన్ స్టాలో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సంభాషించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ఆటగాడు అద్భుతంగా రాణించట్లేదు, జట్టు నుంచి అతడిని తప్పించండి కొందరూ అంటోన్నారు. కానీ అందరూ ఒకటి అర్ధం చేసుకోవాలి, తమతో ఆడే ప్రత్యర్థి జట్టు గెలవాలనే పోరాడుతుంది. ఆటగాళ్ల జట్టులో స్థానం కల్పించడంపై అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. అభిమానులు క్రికెట్‌ను ఆస్వాందించండి. కొన్ని మ్యాచ్ లు పరాజయం పాలైయిండోచ్చు. కానీ, విజయాలు ఎక్కువగా సాధిస్తున్నాం'' అని ఫ్యాన్స్ ను ఉద్దేశించి రోహిత్ అన్నాడు.
టీమిండియాలో ఇప్పుడు ఉన్న యవ క్రికెటర్లలో రిషభ్ పంత్‌కు ఎక్కువ సూచనలు, సలహాలు ఇచ్చానని రోహిత్ తెలిపాడు. రిషభ్ పంత్‌తో చాలా సార్లు మాట్లాడాను, అతని ఆటతీరు బాగుంటుంది. పంత్ 20-21 ఏళ్లు మాత్రమే. అందరూ అతనిపై దృష్టి సారించడంతో.. తీవ్ర ఒత్తిడికి తోనవుతున్నాడు. ఆటగాళ్ల విఫలమైనప్పుడు మీడియాలో కథనాలు వస్తుంటాయి. కానీ, మీడియా కూడా ఆలోచించాలి. మీడియాలో వచ్చే వార్తలు ఆటగాళ్లను ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. అలాగే యువ క్రికెటర్లు అనుభంకోసం వేచి చూడకండా. ఆడే ప్రతి మ్యాచ్ చివరిది అనుకోవాలి అని రోహిత్ తెలిపాడు.
ఈ సందర్భంగా యువరాజ్, రోహిత్ మధ్య మరో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఒకప్పుడు యువ క్రికెటర్లు సీనియర్ల సలహాలు పాటించే వారు ఇప్పడు ఎవరూ అలా చేయడంలేదు అని యూవీ అన్నాడు. అంతే కాదు తమ టైంలో దాదా, సచిన్ లాంటి వారి ఎన్నో సలహాలు ఇచ్చే వారు అని తెలిపారు. ఇప్పడు ఉన్న టీమిండియా జట్లులో కోహ్లీ, రోహిత్ మాత్రమే సినీయర్లు , ఇప్పడు ఉన్న యువ క్రికెటర్లు సినియర్లను సలహా కడా అడగటమే మానేశారు అంటూ యూవీ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.