నిలకడగా ఆడుతున్న ఫెలుక్వాయె సహనాన్ని కోల్పోయాడు. కుల్దీప్ బౌలింగ్ లో ఓ భారీ సిక్స్ కొట్టి ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చే ప్రయత్నం చేసాడు. కానీ, తర్వాత చాహల్ బౌలింగ్ లో అలాంటి ప్రయత్నమే చేసి ధోనీ చేతిలో స్టంప్ అవుట్ గా దొరికిపోయాడు. ఫెలుక్వాయె 34 పరుగులు చేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు 40 ఓవర్లకి 161 పరుగులు చేసింది. ఏడూ వికెట్లు కోల్పోయింది. మోరిస్ 11 పరుగులతోనూ, రబడా 1 పరుగుతోనూ క్రీజ్ లో వున్నారు.