క్రికెట్ గ్రౌండ్ లో పాము.. పరుగులు తీసిన ఫీల్డర్లు!

పాము మైదానంలోకి రావడంతో ఫీల్డర్లు పరుగులు తీసిన సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది.

Update: 2019-12-09 08:45 GMT
Snake disturbed the Raji match in Vijayawada.. Image from BCCI Tweet

అంతా క్రికెట్ హడావుడిలో ఉన్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ పాము.. గ్రౌండ్ లో ఫీల్డర్లని చెల్లా చెదురు చేసింది. సాధారణంగా.. కుక్కలు..పిల్లులు వంటి జంతువులు గ్రౌండ్ లోకి రావడం వాటిని గ్రౌండ్ మెన్ తరిమి కొట్టడడం జరుగుతుంటుంది. కానీ. గ్రౌండ్ లోకి పాము రావడంతో అందరిలోనూ భయం పట్టుకుంది. దీంతో ఫీల్డింగ్ చేస్తున్న వారు గ్రౌండ్ వదిలి పరుగులు పెట్టారు. దీంతో కొన్ని నిమిషాల పాటు ఆట నిలిచిపోయింది.

ఈ సంఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఆంధ్రా, విదర్భ జట్ల మధ్య జీ ట్రోఫీలో భాగంగా మ్యాచ్ విజయవాడలో జరుగుతోంది. అకస్మాతుగా మైదానంలోకి పాము దూసుకొచ్చింది. దీంతో.. ఫీల్డింగ్ చేస్తున్న విదర్భ క్రికెటర్లు మైదానంలో పరుగులు తీశారు. మైదానంలోకి పాము రావడంతో గ్రౌండ్ సిబ్బంది రంగంలోకి దిగి దాన్ని వెలుపలకి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో.. కొన్ని నిమిషాల పాటు మ్యాచ్‌కి అంతరాయం కలిగింది. పాము గ్రౌండ్‌లో చక్కర్లు కొడుతున్న వీడియోని బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అది వైరల్ గా మారింది. క్రికెట్ అభిమానులు ఆ వీడియో పై సరదాగా స్పందిస్తున్నారు.

ఈ రంజీ మ్యాచ్‌లో విదర్భ టీమ్ కెప్టెన్ ఫజల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఆంధ్రా జట్టు 32 ఓవర్లు ముగిసే సమయానికి 87/3తో ఉంది. క్రీజులో కెప్టెన్ హనుమ విహారి (43 నాటౌట్), వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (13నాటౌట్) ఉన్నారు. ఓపెనర్లు గణేశ్వర్ (8), ప్రశాంత్ కుమార్ (10) తో పాటు తరువాత వచ్చిన రికీ భుయ్ (9) కూడా పెద్దగా ఆడలేక వికెట్లు సమర్పించుకున్నారు. దాంతో వీరి తరువాత వచ్చిన హనుమ విహారి నిలకడగా ఆడుతు ఆంధ్రా ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.  



Tags:    

Similar News