గాయాల కారణంగా ఫామ్ కోల్పోతూ జట్టులో స్థానం కోల్పోతున్నాడు భారత జట్టు ఓపెనర్ బాట్స్ మెన్ శిఖర్ ధావన్.. ఈ ఏడాది మొత్తం ధావన్ వీటితోనే గడిపాడు. ఈ నేపధ్యంలో బాగా ఆడాలని అతని కొడుకు జొరావర్ సరదాగా కొడుతుంటాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో శిఖర్ ధావన్ కొడుకు ధావన్ మీదకెక్కి తంతూ, కాలితో తలపై మోదుతూ చక్కగా ఆడాలని హెచ్చరిస్తాడు. ఇదంతా వీడియో తీసిన ధావన్ సతీమణి పై ఘటనపై వ్యాఖ్యానం చేస్తూ ఉంటుంది. దీనిని ధావన్ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ నా హెడ్ కోచ్ బాగా ఆడాలని నన్న మోటివేట్ చేస్తున్నాడు. గబ్బర్‌ను కేవలం చోటా గబ్బర్ (జొరావర్) మాత్రమే కొట్టగలడు. నన్ను చూడటానికి నా వైఫ్, జొరావర్ రావడం ఆనందంగా ఉంది. వారితో తగినంత సమయం గడపనుండడంపై ఉత్సాహంగా ఉన్నాను " అని పోస్ట్ చేశాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో శిఖర్ ధావన్ మోకాలికి గాయమైంది. దీనితో ధావన్ శస్త్రచికిత్స చేయించుకొని మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. శ్రీలంకతో టీ20, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లకు ఎంపికయ్యాడు ధావన్ . ప్రస్తుతం ధావన్ భార్య, కుమారుడు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారు. త్వరలో భారత్ కి రానున్నారు. ఇక ధావన్ కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడుతున్నాడు. అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడని కితాబు ఇచ్చాడు.