వికెట్లు నిలబెట్టుకుంటున్నారు.. పరుగులు మాత్రం కష్టమైపోతున్నాయి. అంతరాన్ని తగ్గించుకునే ప్రయత్నమే కానీ, విజయం కోసం ప్రయత్నించే అవకాశం కనిపించడం లేదు. ఒకే ఒక్కడు పట్టు వదలకుండా పోరాడుతున్నాడు. ఇదీ బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితి.వరల్డ్ కప్ క్రికెట్ లో భాగంగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మ్యాచ్ లో 287 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బంగ్లాదేశీయులు అవస్థలు పడుతున్నారు. ఏ దశలోనూ పరుగుల ప్రవాహాన్ని చూపించలేకపోయారు. హాసన్ ఒక్కడే వున్తరిపోరాటం చేస్తున్నాడు. షకీబ్ కు తోడుగా రహీం నిలిచినా పరుగులో వేగం లేదు. దాంతో చేయాల్సిన పరుగులు కొండలా పేరుకు పోతున్నాయి. 30 ఓవర్లు ముగిసే సరికి బాంగ్లాదేశ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. రహీం 44 పరుగులు చేసి అవుటయ్యాడు. షకీబ్ 90 పరుగులు చేసి పోరాటం చేస్తున్నాడు.