స్కాట్లాండ్ క్రికెటర్ కి కరోనా పాజిటివ్
కరోనా వైరస్.. మొన్నటి వరకు దీని ప్రభావం పెద్దగా లేనప్పటికీ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.
కరోనా వైరస్.. మొన్నటి వరకు దీని ప్రభావం పెద్దగా లేనప్పటికీ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది.చైనాలోని వ్యూహన్ లో తొలుత ప్రారంభం అయిన వైరస్ క్రమక్రమంగా ఇతర దేశాల వ్యాపించి ప్రజలను భయాందోళనలకు గురి చేస్తుంది. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావం వలన చాలా మంది తమ ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఇక ఈ వ్యాధి వలన స్పానిష్ లోని ఫుట్ బాల్ కోచ్ ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికి తెలిసిందే.
తాజాగా స్కాట్లాండ్ కు చెందిన మజీద్ అనే ఓ క్రికెటర్ కి కరోనా సోకింది. కరోనా వైరస్ లక్షణాలు కనిపించగా , అతను వైద్యులను సంప్రదించగా అతనికి పాజిటివ్ వచ్చినట్లుగా తెలిపారు. ప్రస్తుతం తానూ కోలుకుంటున్నానని మజీద్ వెల్లడించాడు. ప్రస్తుతం అతనిని గ్లాస్గో లోని రాయల్ అలెగ్జాండర్ హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు.. ఈ వైరస్ నుంచి కోలుకుని త్వరగా ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నట్లుగా మజీద్ వెల్లడించాడు.
మజీద్ పాకిస్తాన్ దేశస్థుడు అయినప్పటికీ స్కాట్లాండ్ జట్టుకు ఆఫ్ స్పిన్నర్ గా సేవలందిస్తున్నాడు. 2006 నుంచి 2010 వరకు తన అంతర్జాతీయ క్రికెట్ లో ఆ జట్టు తరఫున 60 వికెట్లు తీసి అత్యధిక వన్డే వికెట్లు తీసిన క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. ఇక మజీద్ 2017 లో జరిగిన ప్రపంచ కప్ లో చివరిసారిగా ఆడాడు.
ఇక కరోనా వైరస్ ప్రభావం వలన ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఇక భారత్ లో కూడా 270 కి పైగా కేసులు నమోదు అయ్యాయి. అయిదు మరణాల సంభవించాయి. వైరస్ ప్రభావితం ఎక్కువ కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే స్కూల్స్, ధియేటర్స్, పబ్బులు, స్విమ్మింగ్ ఫూల్స్ మొదలగు వాటిని మార్చి 31 వరకు రద్దు చేశాయి. అంతేకాకుండా వ్యక్తిగత శుభ్రత అన్నిటికంటే ముఖ్యమని చెబుతున్నాయి.