మై లైఫ్..మై ఫోటో.. సానియా పోస్టుకు నెటిజన్లు ఫిదా
భారత దేశ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో ఓ చేతిలో తన కుమారుడు ఇజహాన్‌ను మరో చేతిలో టెన్నిస్ రాకెట్‌ను పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు.
భారత దేశ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో ఓ చేతిలో తన కుమారుడు ఇజహాన్‌ను మరో చేతిలో టెన్నిస్ రాకెట్‌ను పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. అంతే కాదు ఆ ఫోటోలో టెన్నిస్ కోర్టు నుంచి వస్తున్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసూ.. ఓ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ' నా జీవితం ఒకే చిత్రంలో. నాకు మరో దారి లేదు. నా పని నేను నిర్వహించడానికి చేయడానికి నన్ను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు. '' అనే క్యాప్షన్‌తో ఇచ్చారు. ఈ ఫోటో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో అటు తల్లిగా.. బిడ్డ సంరక్షణతో పాటు ఇటు టెన్నిస్ సమన్వయం చేస్తున్నావంటూ నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తు్న్నారు. 2010తో పాక్ క్రికెటర్ సోయబ్ మాలిక్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా తన కొడుకు ఇజహాన్‌ను దుబాయ్ తీసుకెళ్లారు. మార్చి 8న దుబాయ్‌లో ఫెడ్ కప్ టోర్నీ జరగనుంది. టెన్ని్స్ కు విరామం దొరికినప్పుడల్లా తన కొడుకుకు సమయం కేటాయించారు. ఇక ఇండోనేషియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2-1తో విజయం సాధించింది. ఈ విజయంతో తొలిసారి వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో సానియా మీర్జా, అంకిత, రుతుజా, రియా భాటియా, సౌజన్య భవిశెట్టిలతో భారత జట్టు నాలుగు మ్యాచ్ లో విజయం సాధించింది. సానియా మీర్జా తన కెరీర్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలుచుకుంది.