కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కారణంగా సీఏఏ కమిటీనుంచి గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్, వీవీఎస్ లక్ష్మణ్ తప్పుకున్న సంగతి తెలిసిందే. క్రికెట్ సలహాదారుల కమిటీని శనివారం మళ్లీ ఏర్పాటు చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. కాగా.. సచిన్ టెండూ ల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి ఈ కమిటీలో చేరే అవకాశం ఉంది. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నికైనా తర్వాత నుంచి సీఏసీ మళ్ళి ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో బీసీసీఐ ఏజీఏం మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించుకుంది. ఈ సమావేశంలోనే కొత్త సెలక్షన్ కమిటీని కూడా ప్రకటించే అవకాశం ఉంది.