ర‌ష్యాపై 4ఏళ్ల పాటు నిషేదం

రష్యాపై డోపింగ్ వివాదం వెంటాడుతోంది. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కొరఢా ఝళిపించింది. అంతే కాకుండా రష్కాను 4 సంవత్సరాల పాటు ఒలింపిక్స్ లో పొల్గొనకుండా వాడా నిషేదం విధించింది.

Update: 2019-12-09 14:52 GMT
Russia banned from Olympic Games over doping scandal

రష్యాపై డోపింగ్ వివాదం వెంటాడుతోంది. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కొరఢా ఝళిపించింది. అంతే కాకుండా రష్కాను 4 సంవత్సరాల పాటు ఒలింపిక్స్ లో పొల్గొనకుండా వాడా నిషేదం విధించింది. వాడా నుంచి సేకరించిన ఆధారాలతో 2022 బీజింగ్ ఒలింపిక్స్‌లో కూడా పొల్గొనే అవకాశంలేదు . సోమవారం విచారణ జరిపిన వాడా రష్యాపై పలు ఆరోపణు వాటికి సాక్షాలు కూడా ఉన్నట్లు తెలిపింది.

లాసాన్‌లో ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈక్రమంలో వచ్చే 4ఏళ్లపాటు అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనకుండా రష్యాను నిషేదించింది. ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో నిర్ణయంపై సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రష్యాపై ఇంతకంటే పెద్ద శిక్ష విధించాలని లిండా హెల్లలాండ్ వ్యాఖ్యానించారు.

మరోవైపు విధించిన నిషేదంపై అపీలు చేసుకునేందుకు 21 రోజుల గడువు ఇచ్చినట్లు తెలిపింది. కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ దీనిపై విచారణ చేపట్టనుంది. నిషేదం ఎదుర్కొవడం కొత్తేమి కాదు. 2018లో కూడా ప్యాంగ్చాంగ్‌లో నిర్వహించిన వింటర్ ఒలింపిక్స్‌లో 168 మంది రష్యాన్ అథ్లెట్లు వేరే జట్టు తరపున బరిలోకి దిగారు. 2020లో జరిగే యూరో టోర్నీలో రష్యా పొల్గొంటుంది. ఈ నిషేధంతో రష్యా అథ్లెట్లు తటస్థ జెండాతో పాల్గొనే అవకాశం ఉంది. 

Tags:    

Similar News