ప్రపంచ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో భారత ఓపెనర్ బాట్స్ మెన్ రోహిత్ శర్మ (104) శతకం సాధించాడు . షకిబ్ వేసిన చివరి బంతికి రోహిత్ ఈ శతకాన్ని అందుకున్నాడు . ఈ టోర్నీలో రోహిత్ కి ఇది నాలుగో సెంచరీ .. వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. ఇప్పటివరకు టోర్నీ లో రోహిత్ దే అత్యదిక స్కోర్ కావడం విశేషం .అయితే అ వెంటనే రోహిత్ వెనుదిరిగాడు .. మరో ఓపెనర్ రాహుల్ సెంచరీ దిశగా ఆడుతున్నాడు . ప్రస్తుతం భారత్ 29 ఓవర్లకు గాను ఒక వికెట్ నష్టపోయి 180 పరుగులు చేసింది . ఇందులో రోహిత్ (104) రాహుల్ (71) పరుగులు చేసారు .. ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లి , రాహుల్ ఉన్నారు ..