రోహిత్ క్లీన్‌షేవ్ ఆమె కోసమేనట..!

Update: 2019-12-10 16:32 GMT
Rohit Sharma, Kuldeep

ముంబై వాంఖడే స్టేడియం వేధికగా వెస్టిండీన్‌తో బుధవారం నిర్ణయాత్మక టీ20 పోరు జరగనుంది. ఇప్పటికే సిరీస్ 1-1తో కావడంతో రెండు జట్ల మధ్య పోటీ హోరాహోరీగా జరగనుంది. టీమిండియా వైన్‌ కౌప్టెన్‌ రోహిత్ శర్మకు వాంఖడే సొంతమైదానం కావడంతో విజృభిస్తాడని అభిమానులు ఆశిస్తు్న్నారు. అయితే రోహిత్ శర్మ మాత్రం విండీస్ పై జరిగిన గత రెండు మ్యాచ్లో విఫలమైయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ లోనైనా రాణిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ, టీమిండియా బౌలర్ యుజువేంద్ర చాహల్‌ తరచు చిలిపి సంభాషణలు చేస్తూంటారు. సామాజిక మాధ్యమాల్లో వీరు చేసే సంభాషణ తరచు నవ్వుతెప్పిస్తుంది. వీరి మధ్యలోకి రోహిత్‌ భార్య రితికా సజ్బె వస్తుంటుంది. అయితే ఎప్పుడూ గడ్డంతో కనిపించే రోహిత్ క్లీన్‌ షేవ్‌‌తో కనిపిస్తున్నాడు. దీని కారణం అన్వేషించే పనిలో పడ్డారు అభిమానులు, గడ్డం తీయడం పై కలదీప్ యాదవ్ అడిగిన ర్యాపిడ్‌ ఫైర్‌ ఇంటర్వ్యూలో రోహిత్ చేప్పేశాడు. రోహిత్ క్లీన్ షేవ్ తో కనిపించడానికి అతని కూతురేనని వెల్లడించారు. గడ్డం ఉంటే రోహిత్ కూతురు భయపడి అతని వద్దకు రాదని అందుకే గడ్డం తీశాడని కులదీప్ తో చెప్పాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను బీసీసీఐ తన వెబ్ సైట్లో ఉంచింది. 

  

Tags:    

Similar News