ప్రపంచ బ్యాట్స్‌మెన్‌ లో స్పెషల్ రోహిత్

Update: 2019-07-17 11:32 GMT

ఐసీసీ స్పెషల్ బ్యాట్స్‌మెన్‌ లో అగ్రస్థానం సాధించి అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ. ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన బ్యాట్స్ మెన్ జాబితాతో కూడిన వీడియోను ఐసీసీ విడుదల చేసింది. దానిలో మొదటి స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలతో రోహిత్‌ శర్మ 648 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించిన హిట్‌మ్యాన్‌ 81 సగటుతో పరుగులు చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ జాబితాలో రోహిత్‌ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో డేవిడ్‌ వార్నర్‌, మూడోస్థానంలో షకీబుల్‌ హసన్‌, నాలుగో స్థానంలో కేన్‌ విలియమ్సన్‌, ఐదో స్థానంలో జోయి రూట్‌ ఉన్నారు. ఇక పరుగుల ప్రకారం చూసుకుంటే.. రోహిత్‌ కన్నా ఒక్క పరుగు తక్కువ చేసిన డేవిడ్‌ వార్నర్‌ 647 పరుగులతో, 71.89 సగటుతో రెండో స్థానాన్ని సాధించాడు. బంగ్లాదేశ్‌ లీగ్‌ దశలోనే తన పోరాటాన్ని ముగించినప్పటికీ.. ఆ జట్టు తరఫున అద్భుతంగా ఆడిన షకీబుల్‌ 86.57 సగటుతో 606 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ 578 పరుగులు చేయగా.. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ జోయి రూట్‌ 556 పరుగులు చేశాడు. 



Tags:    

Similar News