గత కొద్దిరోజులుగా ఇండియన్ కెప్టెన్ కోహ్లి మరియు ఇండియన్ వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విభేదాలు ఉన్నాయని కథనాలు వచ్చాయి . అయితే మా మధ్య ఎలాంటి విభేదలు లేవని ఒకవేళ అలా ఉంటే మా మొఖంలోనే తెలిసిపోతుందని చెప్పుకొచ్చాడు కోహ్లి ..అయన జనాలు నమ్మడం లేదు . ఎందుకంటే ఇక నేను జట్టు కోసం ఆడను.. దేశం కోసం ఆడతాను అని రోహిత్ శర్మ చేసిన వాఖ్యలే .. రోహిత్ శర్మ ఇండైరేక్ట్ గా కోహ్లినే అన్నాడు అని అంతా అనుకుంటున్నారు . అయితే తాజాగా వెస్టిండీస్ తో టూర్ కి సిద్దం అయిన ఇండియన్ టీం ప్రస్తుతం అమెరికాలో తిరుగుతోంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లతో కలిసి తాను దిగిన ఫొటోను కోహ్లి షేర్ చేశాడు. అయితే ఇది చుసిన రోహిత్ ఫాన్స్ మాత్రం మా హిట్టర్ మ్యాన్ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు ..