అండర్-14లో డబల్ సెంచరీ కొట్టిన మాజీ క్రికెటర్ కొడుకు
భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ అంటే తెలియని వారు ఉండరు. భారత జట్టుకి కెప్టెన్ గా, ఆటగాడిగా ఎన్నో విజయాలను అందించాడు ద్రావిడ్..
భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ అంటే తెలియని వారు ఉండరు. భారత జట్టుకి కెప్టెన్ గా, ఆటగాడిగా ఎన్నో విజయాలను అందించాడు ద్రావిడ్ .. ఇక టెస్ట్ లో అయితే దివాల్ అని ముద్దుగా పిలుచుకుంటారు. టెస్ట్ లో ద్రావిడ్ బ్యాటింగ్ కి దిగాడంటే బౌలర్లు అలిసిపోవాల్సిందే..ఇలా భారత క్రికెట్ జట్టులో ఎన్నో మ్యాచ్ లు ఆడి క్రికెట్ చరిత్రలో తనకంటూ ఓ పేజీని క్రియేట్ చేసుకున్నాడు ద్రావిడ్.. ప్రస్తుతం టీమిండియా జూనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు ద్రావిడ్..
ఇక ఇది ఇలా ఉంటే తాజాగా ద్రవిడ్ కొడుకు సమిత్ కొంతకాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. తండ్రి దగ్గరి నుంచి ఆటలో అన్నీ తెక్నిస్ తెలుసుకొని దూసుకుపోతున్నాడు. తాజాగా ఢిల్లీలో అండర్ 14 రాష్ట్ర క్రికెట్ టోర్నమెంట్‌లో ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. ఈ మ్యాచ్ అనంతరం సమిత్ ని తండ్రికి తగ్గ కొడుకు అని అంటున్నారు. భవిష్యత్తులో సుమిత్ మరో ద్రావిడ్ గా ఎదగడం ఖాయమని చెబుతున్నారు.
#RahulDravid s son Samit scores double ton in U14 cricket!!
— Bharathi M Kumar (@BharathiKumar4) December 20, 2019
Like Father.. Like Son! ❤️ Hope to see the name "Dravid" back in the Indian score card very soon!!🤩 pic.twitter.com/Y2fOgOVdp6