ఎంపీ జోగినపల్లి సంతోష్ విసిరినా గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు స్వీకరించారు. గోపీచంద్ బ్యాట్మింటన్ అకాడమీలో మొక్కలు నాటారు. తాను మొక్కలు నాటడమే కాదు మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. విరాట్ కోహ్లీ, అక్షయ కుమార్, సానియా మీర్జాలకు మొక్కలు నాటాల్సిందిగా ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ విసిరారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్‌కుమార్‌కు సింధు అభినందనలు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
I congratulate @MPsantoshtrs garu who started this #GreenIndiaChallenge where one has to plant 3 saplings🌳and nominate 3 more to do the same .Am happy to be a part of this noble cause and I further nominate @imVkohli @akshaykumar @MirzaSania pic.twitter.com/6lPzJH6uIA
— Pvsindhu (@Pvsindhu1) November 2, 2019