మా ఓటమికి కారణం అదే : పొలార్డ్

Update: 2019-12-07 16:44 GMT
Kieron Pollard

ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మొదటి టీ 20 మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.. ఈ మ్యాచ్ లో విండిస్ 207 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికి గెలవలేకపోయింది. అయితే ఆ జట్టు ఓటమికి గల కారణాల గురించి ఆ జట్టు జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్ బయటపెట్టాడు.

మేము చేసిన 208 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం సులువే.. బ్యాటింగ్ లో మెరుగ్గానే రాణించాము కానీ.. బౌలింగ్‌లో ఆశించిన మేర రాణించలేకపోయాం. ముఖ్యంగా ఎక్స్‌ట్రాల కారణంగా మ్యాచ్‌ని చేజార్చుకున్నాం. ముందుగా మేము అనుకున్నా వ్యూహాలను సరిగ్గా అమలు చేసి ఉంటే ఖచ్చితంగా మ్యాచ్ ని గెలుచుకునే వాళ్ళమని పోలార్డ్ చెప్పుకొచ్చాడు.

మొదటి పది ఓవర్లు ఒకే అనిపించిన విండిస్ బౌలర్లు ఆ తరవాత భారత బాట్స్ మెన్స్ కి ఎక్కడ కూడా అడ్డుకట్ట వేయలేకపోయారు. దానికితోడు ఆ జట్టు‌లో ముగ్గురు బౌలర్లు నోబాల్స్ ఆ జట్టుకి భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ 20 మ్యాచ్ రేపు ముంబైలో జరగనుంది. 

Tags:    

Similar News