ప్రధాని మోడీ దేశంలోని ప్రముఖ క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ విభాగాలకు చెందిన మొత్తం 40 మంది క్రీడాకారులతో కాన్ఫరెన్స్‌లో చర్చించారు. కరోనా నేపథ్యంలో వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన పెంచాలని లాక్‌డౌన్ నిబంధనలు పాటించేలా కృషి చేయాలని క్రీడాకారులను కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌లో తెలుగు తేజం పీవీ సింధుతో పాటు సచిన్, కోహ్లీ, ధోనీ మిగతా క్రీడాకారులు పాల్గొన్నారు. తమ విలువైన సూచనలు చేశారు.