ఓటమి దిశలో.. మరో వికెట్ కోల్పోయిన ఇండియా!

Update: 2019-06-30 16:44 GMT

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అతి జాగ్రత్తకు పోయి పీకల మీదకు తెచ్చుకున్నారు టీమిండియా బ్యాట్స్ మెన్. నాలుగో స్థానానికి విజయ శంకర్ క్షణంలో జట్టులోకి తీసుకున్న రిషబ్ పంత్ నిరాశ పరిచాడు. కష్ట కాలంలో ఆదుకోలేకపోయాడు. వేగంగా పరుగులు చేసినా.. కీలక సమయంలో అవుట్ అయి భారత్ ను కష్టాల్లోకి నెట్టేశాడు. ప్లంకెట్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి వోక్స్ కు క్యాచ్ ఇచ్చి 32 పరుగులతో వెనుతిరిగాడు. ప్రస్తుత్తం టీమిండియా 40 ఓవర్లకే నాలుగు వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. పాండ్య (29 ), ధోనీ (0 ) క్రీజులో ఉన్నారు. పది ఓవర్లలో 104 పరుగులు చేయాలి. 

Tags:    

Similar News