టీమిండియా జోరు తగ్గలేదు. రోహిత్ శర్మ ఔటయ్యాకా పాండ్యతో కలసి కెప్టెన్ కోహ్లీ స్కోరు బోర్డును పరుగులెట్టించాడు. ఈ క్రమంలో క్రమంలో తన 53 బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోపక్క కోహ్లీ కి అండగా ఉన్న పాండ్య పరుగుల వేగం పెంచే దిశలో తన వికెట్ కోల్పోయాడు. అమిర్ వేసిన 43 వ ఓవర్లో ఒక ఫోర్ కొట్టి అదే ఊపులో మరో భారీ షాట్ ఆడబోయి బాబర్ ఆజం కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. కోహ్లీ తో కలసి పాండ్య 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. మొత్తమ్మీద 45 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా మూడువందల పరుగుల మార్క్ దగ్గరకు చేరింది . మూడు వికెట్లను కోల్పోయి 298 పరుగులు చేసింది. కోహ్లీ 67 పరుగులతోనూ, ధోనీ ఒక్క పరుగుతోనూ క్రీజులో ఉన్నారు.
కోహ్లీ తన వన్ డే కెరీర్ లో 11,000 పరుగుల మైలు రాయిని దాటాడు.
#ViratKohli scores his 11,000th ODI run!
— Cricket World Cup (@cricketworldcup) June 16, 2019
He reaches the landmark in 54 fewer innings than anyone else 👀 pic.twitter.com/mebDOLJESs