308 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ జట్టు రెండో ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు ఆస్ట్రేలియాతో తలపడుతున్న పాకిస్తాన్ జట్టు ఛేదన నిదానంగా ప్రారంభించింది. కమిన్స్ వేసిన తొలి ఓవర్‌లో 2 పరుగులు చేసింది. రెండో ఓవర్లో కమిన్స్ వేసిన 2.1వ బంతిని ఆడబోయి ఫకర్ జమాన్ (0; 3 బంతుల్లో) రిచర్డ్‌సన్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో పాక్ తొలి వికెట్ కోల్పోయింది. అటు తరువాత క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజామ్ చక్కని ఆటతీరు ప్రదర్శ్స్తున్నాడు. జాగ్రత్తగా ఆడుతూనే.. ఐదో ఓవర్లో మూడు బౌండరీలు బాదేశాడు. దీంతో ఐదు ఓవర్లకు పాక్ స్కోరు ఒక వికెట్ నష్టానికి 18 పరుగులుగా ఉంది.