మొదటి వికెట్ పడిన తరువాత పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ నిదానంగా ఆడుతున్నారు. ప్రతి బంతిని ఆచి, తూచి ఆడుతున్నారు. మరోపక్క భారత్ బౌలర్లు కూడా చక్కని బంతులేస్తూ వారిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 337 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకునే క్రమంలో పాకిస్థాన్ జట్టు పది ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 38 పరుగులు చేసింది. జమాన్ 16 పరుగులతోనూ, బాబర్ అజాం 13 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.