భారత్ మేలు చేస్తే చిరకాలం గుర్తుంచుకుంటాం: అక్తర్

కరోనా వైరస్ ప్రపంచాన్నీ వణికిస్తోంది. ఈ వైరస్ ని అరికట్టడానికి అన్ని దేశాలు తమ శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నాయి.

Update: 2020-04-09 13:57 GMT
Shoaib Akhtar (File Photo)

కరోనా వైరస్ ప్రపంచాన్నీ వణికిస్తోంది. ఈ వైరస్ ని అరికట్టడానికి అన్ని దేశాలు తమ శక్తికి మించి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా పాకిస్తాన్ విపత్కరమైన పరిస్థితిని ఎదురుకుంటుంది. ఇప్పటికే ఆ దేశంలో 4,263 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, అందులో సుమారు 60 మంది వరకు చనిపోయారు. ఈ నేపధ్యంలో తమ దేశాన్ని భారత్ ఆదుకోవాలని ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్‌ అన్నాడు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశాల మధ్య ఉన్న తేడాలను పక్కనపెట్టి మానవతా కోణంలో మాకు సాయం చేయాలనీ, ఆ సహాయాన్ని పాక్ ఎప్పటికి గుర్తుపెట్టుకుంటుందని అక్తర్ వెల్లడించాడు. అంతేకాకుండా వైద్యపరమైన మౌలిక సదుపాయాల విషయంలో భారత్‌ చొరవచూపాలిని అక్తర్ కోరాడు..

ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాలి

ఇక ఇదే సందర్భంలో పాక్, భారత్ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాలని అక్తర్ కోరాడు.. ఇరు దేశాలు మూడు వన్డేల సిరీస్‌ ఆడితే వీటితో వచ్చిన డబ్బులను విరాళంగా సేకరిస్తే ఇరు దేశాలకి ఉపయోగపడుతుందని అక్తర్ అన్నాడు. దీనికి తటస్థ వేదికగా దుబాయ్‌ను అక్తర్‌ సూచించాడు. 2007 తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఎటువంటి ద్వైపాక్షిక క్రికెట్‌ సిరీస్ జరుగలేదు. ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో, ఆసియా కప్‌లో మాత్రమే ఇరు దేశాలు తలపడుతున్నాయి.

యువీ,భజ్జీలపై ట్రోలింగ్‌ పై స్పందన..

కరోనా ప్రభావంపై పాకిస్తాన్ లాక్ డౌన్ విధించింది. దీంతో పేద ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. వారిని ఆదుకునేందుకు అక్తర్ తన వంతుగా ముందుకి వచ్చి తన స్వచ్చంద సంస్థ ద్వారా విరాళాలు సేకరిస్తునాడు. ఈ క్రమంలో భారత్ మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్, స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతు నిలించారు. వారు చేసిన సేవకి గాను కొందరూ భారత అభిమానులు.. యూవీ, భజ్జీపై ట్రోలింగ్‌కు దిగారు. అయితే దీనిపైన అక్తర్ స్పందించాడు. మతం, దేశంతో కాకుండా మానవత్వంతో వారు సేవ చేశారని అక్తర్ అభిప్రాయపడ్డాడు.


Tags:    

Similar News