మూడో వికెట్ కోల్పోయిన పాక్

Update: 2019-06-12 15:29 GMT

భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రెండు వికెట్లు కోల్పోయినా.. పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడారు. సంయమనంతో పరుగులు రాబడుతూ వికెట్లు కాపాడుకుంటూ.. ఆసీస్ బౌలర్లను పరీక్షించారు. 25 ఓవర్ల వరకూ ఎటువంటి ఇబ్బందీ లేకుండా రెండు వికెట్ల నష్టానిని 136 పరుగులు చేశారు. పాక్‌ ఓపెనర్‌ ఇమామ్‌(52) అర్ధశతకం సాధించాడు. కౌల్టర్‌నైల్‌ వేసిన 24.5వ బంతిని బౌండరీకి తరలించి లాంఛనం పూర్తి చేసుకున్నాడు. హఫీజ్‌ (44) అర్ధశతకానికి చేరువలో ఉన్నాడు. సరిగ్గా ఈ సమయంలో ఆసీస్ బౌలర్ కమిన్స్‌ వేసిన 25.1వ బంతికి కీపర్‌ కారెకు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో పాకిస్తాన్ మరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం పాక్ స్కోరు 26 ఓవర్లకు 139 మూడు వికెట్లకు. హఫీజ్ 45 (47), అహ్మద్ 2 (4) పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News