బ్యాటింగ్ లో నెంబర్ వన్, టూ వాళ్లే!

Update: 2019-07-07 16:50 GMT

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ప్రపంచ బ్యాటింగ్ ర్యాంకింగ్ లలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు. ఈరోజు ఐసీసీ తాజాగా వన్డే ర్యాంకింగ్ లు ప్రకటించింది. దీన్లో కోహ్లీ తన మొదటి స్థానాన్ని 891 పాయింట్లతో నిలబెట్టుకోగా.. అతనికి చేరువలో 885 పాయింట్లతో రోహిత్ శర్మ ఉన్నాడు. ఇక మూడో స్థానంలో పాక్ బ్యాట్స్ మాన్ బాబర్‌ అజామ్‌ 827 పాయింట్లతో నిలిచాడు. నాలుగో స్థానంలో దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ డు ప్లిసేస్, ఐదో స్థానంలో న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ రాస్ టేలర్ ఉన్నారు. ఇక బౌలింగ్ లో బుమ్రా అగ్రస్థానంలో ఉన్నాడు. ఇతను 814 పాయింట్లతో టాప్ 1 గా కొనసాగుతున్నాడు. ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలోనూ, కమిన్స్ మూడో స్థానం లోనూ ఉన్నారు.  

Tags:    

Similar News