'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా ఆటగాళ్లు హార్దిక్ పాండ్య, కేఎల్ రాహుల్‌లు మరోసారి వార్తల్లో నిలిచారు. బీసీసీఐ అంబుడ్స్‌మన్ (రిటైర్డ్) జస్టిస్ డీకే జైన్ సారథ్యంలోని కమిటీ టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌కు నోటీసులు జారీ చేసింది. వారిద్దరు తన ముందు ప్రత్యక్షంగా హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించింది. నిబంధనల ప్రకారం రాహుల్, హార్దిక్ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుంది. వారిద్దరి అభిప్రాయాలు వినడం న్యాయం. ఎప్పుడు వస్తారన్నది వాళ్ల ఇష్టం అని అంబుడ్స్‌మన్ జస్టిస్ డీకే జైన్ అన్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న వీరిద్దరు ముంబై, పంజాబ్ మధ్య జరిగే సమయంలో హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.