ఆ చారిత్రాత్మక విజయానికి నేటితో తొమ్మిది ఏళ్ళు...
సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం.. అంటే 2 ఏప్రిల్ 2011, వందకోట్లకుపైగా భారతీయుల హృదయం ఉప్పొంగిన రోజు.
సరిగ్గా తొమ్మిది సంవత్సరాల క్రితం.. అంటే 2 ఏప్రిల్ 2011, వందకోట్లకుపైగా భారతీయుల హృదయం ఉప్పొంగిన రోజు. 28 ఏళ్ల భారతీయుల కళను నెరవేరుస్తూ వన్డే ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. ముంబై వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో భారత్ ఆరు వికెట్లతో విజయం సాదించింది. మహేంద్ర సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ మ్యాచ్ తో సచిన్ టెండూల్కర్ కలను నెరవేర్చింది. ఈ మ్యాచ్‌లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సిక్సర్‌తో మ్యాచ్ ముగించిన తీరు అభిమానులను ఎంతగానో అలరించింది.
ఇక పోతే సొంత గడ్డపై జరిగిన వరల్డ్ కప్ సిరీస్ ని గెలుచుకున్న తోలి జట్టుగా రికార్డు స్నేలకోల్పింది. ఈ మ్యాచ్ లో గౌతం గంభీర్ (97), ధోనీ (91 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అప్పటికి సరిగ్గా 28ఏళ్ల క్రితం 1983లో కపిల్ దేవ్ నేతృత్వంలో తొలిసారిగా భారత్‌కు వన్డే ప్రపంచకప్‌ను అందించిన సంగతి తెలిసిందే. ప్రపంచ కప్ టోర్నీ మొత్తంలో భరత్ జట్టు ఆడిన ప్రతీ మ్యాచ్ లో తమదైన శైలిలో బ్యాటింగ్, బౌలింగ్, ఫెల్దింగ్, అన్ని ఫార్మేట్లో వైవిధ్యమైన రీతిలో ఆడి ప్రపంచ కప్ కళను సార్ధకం చేసుకుంది.
#OnThisDay in 2011, the shot that sent millions of Indians into jubilationhttps://t.co/bMdBNFxggl pic.twitter.com/PIOBaLRRIH
— ESPNcricinfo (@ESPNcricinfo) April 2, 2020
This day in 2011 🗓️
— BCCI (@BCCI) April 2, 2020
HISTORY 🏆🏆🇮🇳💙 #TeamIndia
Watch the highlights of the epic 2011 World Cup final and relive the memories here 📽️📽️ https://t.co/qKuPoMeblY pic.twitter.com/C0apY6tqx0