ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ కౌల్టర్ నైల్ బ్యాట్‌తో మెరిశాడు. విండీస్ బౌలర్ల ధాటికి ఆసీస్ ఒకానొక దశలో 147 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో స్టీవ్ స్మిత్‌తో కలిసి కౌల్టర్ నైల్ రెచ్చిపోయాడు. వచ్చిరాగనే కరేబియన్ బౌలర్లపై విరుచకుపడ్డాడు. దీంతో సెంచరీ సాధిస్తాడునుకున్న తరుణంలో 92 పరుగుల వద్ద బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో క్యాచ్‌ఔట్‌గా వెనుదిరుగుతాడు. అయితే ఈ సమయంలో కౌల్టర్ నైల్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రపంచకప్‌లో ఎనిమిది, ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక పరుగులు(92) సాధించిన ఆసీస్ ఆటగాడిగా కౌల్టర్ రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆండీ బికెల్(65 పరుగులు, 2003లో ఇంగ్లండ్‌పై)రికార్డును అధిగమించాడు. ఇక ఓవరాల్‌గా వన్డేల్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగుల సాధించిన మూడో ఆటగాడిగా మరో ఘనతన అందుకున్నాడు. ఈ జాబితాలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్(95 నాటౌట్, 2016లో శ్రీలంకపై)తొలి స్థానంలో ఉన్నాడు.