టీమిండియా, కివీస్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ టై కావడంతో రెండు జట్ల మధ్య సూపర్ ఓవర్ జరుగుతోంది. సూపర్ ఓవర్‌లో కివీస్ నుంచి కేన్ విలియమ్స్, గుప్తిల్ బరిలోకి దిగారు. భారత్ తరుపున బుమ్రా బౌలింగ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ క్రికెట్ అభిమానులంతా ఉత్కంఠతో తిలకిస్తున్నారు. సూపర్ ఓవర్‌లో భారత్ ముందు 18 పరుగల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా తరపున రోహిత్, రాహుల్ క్రీజులోకి వచ్చారు.