పరువు నిలుపుకుంటారా? చేతులేత్తేస్తారా?

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ - భారత్ మధ్య జరగాల్సిన మూడో వన్డే మంగళవారం బే ఓవెల్ వేదికగా జరగనుంది.

Update: 2020-02-10 12:03 GMT

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌ - భారత్ మధ్య జరగాల్సిన మూడో వన్డే మంగళవారం బే ఓవెల్ వేదికగా జరగనుంది. ఇప్పటికే రెండు వన్డేలు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది. అయితే కివీస్ ఈ మ్యాచ్ లోనూ విజయం సాధించి ఐదు టీ20ల ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. రెండు వన్డేల్లో ఓడిన భారత్ కనీసం ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి పరువు నిలుపుకోవాలని యోచిస్తోంది. ఆఖరి వన్డేలో విజయంతో టెస్ట్ సిరీస్ ముందు టీమిండియా ఆటగాళ్లలో పూర్తి విశ్వాసం నిలిపాలని భావిస్తోంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరం కాగా..టామ్ లాథమ్ సారధ్య బాధ్యతలు చేపట్టాడు.

ఒక వైపు ఐదు టీ20ల ఓటమి తర్వాత పుంజుకుంది. వన్డే సిరీస్ లో భారత్ పై వరుస విజయాలు సాధిస్తుంది. బ్యాటింగ్ బౌలింగ్ లో జట్టు పటిష్టంగా ఉంది. బ్యాటింగ్‌లో మార్టిన్‌ గప్తిల్‌, హెన్రీ నికోల్స్‌, కెప్టెన్ టామ్‌ లాథమ్‌ రాణిస్తున్నారు. ఫామ్ లోకి వచ్చిన రాస్‌ టేలర్‌ తొలి వన్డేలో సెంచరీతో పాటు, రెండో వన్డేలోనూ అజేయ అర్థ సెంచరీతో రాణించి పర్వాలేదనిపించాడు. టామ్‌ బ్లండెల్‌, మార్క్‌ చాపమన్‌, జేమ్స్‌ నీషమ్ మిడిల్ అర్డర్ లో కూడా జట్టు బాగానే రాణిస్తుంది. ‌గ్రాండ్‌హోం, జెమీసన్‌, టిమ్‌ సౌథీ, బెనెట్‌, కాగా.. అరంగేట్రం మ్యాచ్‌లోనే కైల్ జెమీసన్‌ కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. న్యూజిలాండ్ జట్టులో కీలక ఆటగాళ్లు గాయల బారిన పడడం ఆ జట్టును కలవర పెడుతోంది. ము‌‌ఖ్యంగా టీమ్ సౌథీ గాయం కారణంగా ఫిల్డీంగ్ రాలేదు. మిషెల్ సాంట్న‌ర్‌, స్కాట్ కుగిలైన్ గాయ‌ల‌బారిన ప‌డ్డారు. దీంతో సహాయ కోచ్ ల్యూక్ రోంచి ఫిల్డీంగ్ వచ్చిన సంగతి తెలిసిందే. 

కాగా.. టీమిండియా లోవర్ అర్డర్‌లో రవీంద్ర జడేజా, శ్రేయస్‌ అయ్యర్‌, నవదీప్‌ సైనీ పోరాటపటిమ చూపించారు. ఓపెనర్లు రోహిత్ శర్మ గాయం కారణంగా తప్పుకోవడంతో మయంక్ అగర్వాల్, పృధ్వీషా కూడా ఓపెనర్లుగా బరికి దిగారు. అయితే తొలి వన్డేలో శుభారంభాన్ని ఇచ్చిన ఇద్దరు రెండో వన్డేలో విఫలమయ్యారు. ఇద్దరు పూర్తి స్తాయిలో తమ ఆటతీరు కనబరచలేకపోయారు. ఇక కెప్టెన్ కోహ్లీ పూర్తి స్థాయిలో నిలదొక్కుకోలేక పోయాడు. రాహుల్ తక్కువ స్కోర్లు చేస్తున్నప్పటికి భారీ ఇన్నింగ్స్ చేయలేదు. శ్రేయస్స్ అయ్యర్ రెండు వన్డేల్లో అదరగొట్టాడు. మూడో వన్డేలో అదే ఫామ్ కొనసాగిస్తే మ్యాచ్ గెలిచి భారత్ పరువు కాపాడుకునే అవకాశం ఉంది. రెండో వన్డేలో షమీని పక్కన పెట్టిన భారత్.. అతన్ని మూడో వన్డేలో కూడా రిజర్వ్ బెంచ్ కే పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కివీస్ కెప్టెన్ టామ్ లాతమ్ మాట్లాడుతూ... రెండు వన్డేల్లో తమ ఆటగాళ్లు బాగానే రాణిచారని, మొదటి వన్డేలో బ్యాట్స్‌మెన్‌ గెలిపిస్తే, రెండో మ్యాచ్‌లో బౌలర్లు సత్తాచాటారన్నారు. ఆదిలోనే టీమిండియా వికెట్లు తీస్తే వికెట్లు తీస్తే మ్యాచ్‌ తమ చేతుల్లోకి వస్తుంది. రోస్ టేలర్‌-జిమ్మీ జేమీసన్‌ గొప్పగా ఆడారు. ఆక్లాండ్‌ వన్డేలో టీమిండియా చివరి వికెట్‌ తీసే వరకు సంతృప్తి పడలేదు. వికెట్లు పడుతున్న కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడానికి టీమిండియా ఆటగాళ్లు ప్రయత్నించారని అన్నారు. చివరి వన్డేలో కూడా భారత్ పై విజయం సాధించి వన్డే సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తామని తెలిపారు.

రెండో వన్డేలో భారత్‌ 22 పరుగుల తేడాతో పరాజయం పాలయిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ 273/8 పరుగులు చేసింది. మార్టిన్‌ గప్టిల్‌ (79), రాస్‌ టేలర్‌ (73 నాటౌట్‌) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా 251 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రేయస్స్ అయ్యార్ అర్థశతకంతో పాటు, రవీంద్ర జడేజా (55), నవదీప్‌ సైనీ (45) రాణించారు.

తుది జట్లు అంచనా..

భారత్‌:

పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌రాహుల్‌(వికెట్‌ కీపర్‌) , శ్రేయాస్‌ అయ్యర్‌, కేదార్‌ జాదవ్‌, జడేజా, నవదీప్‌ సైనీ, శార్దుల్‌ ఠాకూర్‌, చాహల్‌, బుమ్రా

న్యూజిలాండ్‌:

మార్టిన్‌ గప్తిల్‌, హెన్రీ నికోల్స్‌, టామ్‌ లాథమ్‌, రాస్‌ టేలర్‌, టామ్‌ బ్లండెల్‌, మార్క్‌ చాపమన్‌, జేమ్స్‌ నీషమ్‌, గ్రాండ్‌హోం, జెమీసన్‌, టిమ్‌ సౌథీ, బెనెట్‌ 

Tags:    

Similar News