New Zealand vs India : టీమిండియా ఓపెనర్లకి అనుభవం లేదు : టిమ్ సౌథీ
టీమిండియా ఓపెనర్లపై కివీస్ సినీయర్ బౌలర్ టిమ్ సౌథీ కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియా ఓపెనర్లపై కివీస్ సినీయర్ బౌలర్ టిమ్ సౌథీ కీలక వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ వెల్లింగ్టన్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ఇప్పటికే ఐదు టీ20ల్లో బ్లాక్‌క్యాప్స్‌పై 5-0తో విజయం సాధించింది. అనంతరం జరిగిన మూడు వన్డేల సిరీస్ 3-0తో కోల్పోయిన టీమిండియా మరో సమరానికి సిద్ధం కానుంది. అయితే వన్డే సిరీస్ ఘోర పరాజయం పాలైన భారత్ రెండు టెస్టుల సిరీస్ కైవసం చేసుకోవాలని ఉవ్విళ‌్లూరుతోంది. మరోవైపు కివీస్ సైతం వన్డేల్లో సాధించిన విజయంతో రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుబోతుంది.
టీమిండియా ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌కి అంతర్జాతీయ మ్యాచ్లో ఆడిన అనుభవం లేదని సౌథీ అన్నాడు. అయితే వారీద్దరూ మంచి క్లాస్ ఆటగాళ్లని కొనియాడాడు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన టిమ్ సౌథీ.. గాయాల కారణంగా ఇద్దరు ఆటగాళ్లు భారత్‌కి దూరమయ్యారు. రోహిత్ శర్మ లాంటి సినీయర్ ప్లేయర్లు భారత్ జట్టుకు దూరం కావడం పెద్ద ఎదురు దెబ్బే. అయినప్పటికీ టీమిండియా జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉందని చెప్పాడు.
ప్రస్తుతం టీమిండియాలో మంచి టాలెంట్ ఉన్న యువ క్రికెటర్లున్నారు. టీమ్‌కి అవసరమైన సమయంలో బాధ్యతయుతంగా ఆడేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ఓపెనర్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్‌లకి అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం లేదు.
ప్రస్తుత ఓపెనర్లు పృథ్వీ షా కంటే మయాంక్ అగర్వాల్ అంతర్జాతీయ టెస్టులు ఆడిన అనుభవం ఉంది. మయాంక్ అగర్వాల్ 9 టెస్టులు ఆడితే.. పృథ్వీషా రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. వీరిద్దరు ఓపెనర్లు కివీస్‌పై వన్డేల్లో విఫలమైయ్యారు. దీంతో టీమిండియాకు ఓపెనర్ల ఎవరిని పంపాలనేది పెద్ద సవాల్‌గా మారింది. మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్ పంపించినా నిరాశపరిచాడు. కెప్టెన్ కోహ్లీ కూడా పేలవ ఫామ్ ప్రదర్శిస్తున్నాడు. టీ20ల్లో రాణించిన టీమిండియా బౌలర్లు, వన్డేల్లో తేలిపోయారు. సినీయర్ బౌలర్ షమీకి విశ్రాంతినిచ్చినా.. షైనీ, ఠాకూర్, బుమ్రా దారుణంగా విఫలమైయ్యారు. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్‌లో ఎలా ఆడతారో..? అనే ఆసక్తి నెలకొంది.