రెండో వికెట్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌

Update: 2019-07-09 10:59 GMT

ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఇండియా- న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో నూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. జడేజా వేసిన 18.2వ బంతిని ఆడిన హెన్రీ నికోల్స్‌ (28; 51 బంతుల్లో 2×4) ఔటయ్యాడు. బంతి బ్యాటు, ప్యాడ్ల మధ్యలోంచి వికెట్లను తాకడం గమనార్హం. ప్రస్తుతం 19 ఓవర్లు పూర్తయ్యాయి. కివీస్ రెండు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. టేలర్, విలియమ్సన్ (31) క్రీజులో ఉన్నారు.

Tags:    

Similar News