ప్రపంచ కప్ లో భాగంగా న్యూజిలాండ్ మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ 124 పరుగులు చేసి అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది . తొలి ఓవర్ లోనే న్యూజిలాండ్ కి భారీ షాక్ తగిలింది . ఇంగ్లాండ్ బౌలర్ వోక్స్ వేసినా తొలి ఓవర్ లోని ఐదో బంతికి నికోల్లస్(0)ను ఎల్బీ చేశాడు... అ తర్వాత గుప్తిల్ (8) పరుగులు చేసి అవుట్ అయ్యాడు . కొద్దిగా నిలకడగా ఆడుతున్న కివీస్ బాట్స్ మెన్స్ విలియమ్సన్ (27) రనౌట్ అయ్యాడు . అలాగే రాస్‌టేలర్ (28) కూడా అవుట్ అయ్యాడు . అ తర్వాత నీషమ్(19) పరుగులకే అవుట్ అయ్యడు .. దీనితో అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కివీస్ జట్టు ... ప్రస్తుతం కివీస్ అయిదు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది . క్రీజ్ లో లేథమ్(35), గ్రాండ్‌హోమ్(1) ఉన్నారు.