మొదట్లోనే వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

Update: 2019-06-26 10:58 GMT

వరల్డ్ కప్ టోర్నీలో ఈరోజు న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. వర్షం కారణం గా గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. హఫీజ్‌ బౌలింగ్‌లో తొలి బంతినే గప్తిల్‌(5) బౌండరీకి తరలించి శుభారంభం ఇచ్చాడు. అదే ఊపులో రెండో ఓవర్ మొదటి బంతికే వెనుతిరిగాడు. పాకిస్తాన్ ఫాస్ట్‌ బౌలర్‌ ఆమిర్‌ వేసిన తొలి ఓవర్ తొలి బంతికే గుఫ్తిల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు మొదటి ఐదు ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. మన్రో 11 పరుగులతోనూ, విలియమ్సన్ 12 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News