Neeraj Chopra: డైమండ్ లీగ్ 2024 ఫైనల్లో సెంటీమీటర్ తేడాతో ట్రోఫీని కోల్పోయిన నీరజ్ చోప్రా

Neeraj Chopra Diamond League 2024 Final: డైమండ్ లీగ్ 2024 ఫైనల్లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. సెంటీమీటర్ తేడాతో మరోసారి ట్రోఫీని గెలిచే ఛాన్స్ కోల్పోయాడు. మరోసారి నీరజ్ రెండో స్థానంతోనే సరిపెట్టుకుట్టుకున్నాడు. గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు.

Update: 2024-09-15 01:48 GMT

Neeraj Chopra: డైమండ్ లీగ్ 2024 ఫైనల్లో సెంటీమీటర్ తేడాతో ట్రోఫీని కోల్పోయిన నీరజ్ చోప్రా

Neeraj Chopra Diamond League 2024 Final: స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరోసారి రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఆగస్టు నెలలో జరిగిన లుసానే డైమండ్ లీగ్ లో నీరజ్ రెండవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. శనివారం బ్రస్సెల్స్ వేదికగా కింగ్ బౌడౌయిన్ స్టేడియం లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్‌లో నీరజ్ చోప్రా రెండవ స్థానంలో నిలిచాడు. ఫైనల్‌లో 87.86 మీటర్ల బెస్ట్ త్రో చేశాడు. నీరజ్ కేవలం ఒక సెంటీమీటర్ తేడాతో ఛాంపియన్‌ షిప్ కోల్పోయాడు. గ్రెనడా ఆటగాడు అతని కంటే కొంచెం మెరుగ్గా నిరూపించుకున్నాడు. గ్రెనడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. అతను 87.87 మీటర్లు విసిరాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో అండర్సన్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. నీరజ్‌ చోప్రా రజతం సాధించాడు. పారిస్‌లో స్వర్ణం సాధించిన పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ డైమండ్ లీగ్ ఫైనల్‌లో పాల్గొనలేదు.

నీరజ్ చోప్రా మూడో త్రోను 87.86 మీటర్లు విసిరాడు.

డైమండ్ లీగ్ ఫైనల్స్‌లో మొత్తం 7 మంది జావెలిన్ త్రోయర్లు పాల్గొన్నారు. ఫైనల్లో నీరజ్ చోప్రా మొదటి త్రో 86.82 మీటర్లు విసిరాడు. దీని తర్వాత అతను రెండో త్రోను 83.49 మీటర్లు విసిరాడు. అతను మూడవ త్రోలో కొంత రిథమ్‌లో కనిపించాడు.ట్రోఫీని కైవసం చేసుకుంటాడు అంతా భావించారు. కానీ మూడో త్రోను 87.86 మీటర్లు విసిరాడు. ఈ త్రో కారణంగా నీరజ్ రెండో స్థానానికి చేరుకోగలిగాడు. దీని తర్వాత నీరజ్ రెండు త్రోలు 85 మీటర్ల కంటే తక్కువగా ఉన్నాయి. నీరజ్ చివరి త్రోను 86.46 మీటర్లు విసిరాడు.

డైమండ్ లీగ్ ఫైనల్‌లో నీరజ్ చోప్రా యొక్క అన్ని త్రోలు:

మొదటి త్రో- 86.82 మీ

రెండో త్రో – 83.49 మీ.

మూడో త్రో – 87.86 మీ.

నాలుగో త్రో – 82.04 మీ.

ఐదో త్రో – 83.30 మీ.

ఆరో త్రో – 86.46 మీ.


అండర్సన్ పీటర్స్ మొదటి స్థానంలో నిలవగా, నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచారు. జర్మన్ స్టార్ జూలియన్ వెబర్ తన అత్యుత్తమ త్రో 85.97తో మూడో స్థానంలో నిలిచాడు. జావెలిన్‌లో భారత్ తరఫున రెండు ఒలింపిక్ పతకాలు సాధించిన తొలి ఆటగాడు నీరజ్ చోప్రా. టోక్యో 2020లో బంగారు పతకం, 2024 పారిస్‌లో రజత పతకం సాధించాడు. ఇది కాకుండా అతను డైమండ్ లీగ్ 2022ను గెలుచుకున్నాడు. 2023లో రెండో స్థానంలో నిలిచాడు. డైమండ్ లీగ్‌లో టైటిల్ గెలిచిన తర్వాత, ఆటగాడికి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ కోసం ప్రైజ్ మనీ, వైల్డ్ కార్డ్ ఇస్తారు. 

Tags:    

Similar News