IPL 2020 : 50 మంది క్రికెటర్లకు నాడా డోపింగ్‌ పరీక్షలు.. ప్రణాళిక సిద్దం!

IPL 2020 : క్రికెట్ అభిమానులకి ఫుల్ జోష్ ని అందించడానికి రెడీ అవుతుంది ఐపీఎల్.. వచ్చే నెల (సెప్టెంబర్) 19 నుంచి ఈ ఏడాది సీజన్ మొదలు కానుంది..

Update: 2020-08-25 06:27 GMT

National Anti Doping Agency to carry out 50 tests during IPL 2020

IPL 2020 : క్రికెట్ అభిమానులకి ఫుల్ జోష్ ని అందించడానికి రెడీ అవుతుంది ఐపీఎల్.. వచ్చే నెల (సెప్టెంబర్) 19 నుంచి ఈ ఏడాది సీజన్ మొదలు కానుంది.. కరోనా వలన ఈ సారి వేదికను దుబాయ్ కి మార్చిన సంగతి తెలిసిందే.. అయితే ఈ లీగ్ లో పాల్గొనే క్రికెటర్లకి డోపింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ డోపింగ్‌ నిరోధక సంఘం (నాడా) ప్రణాళికను సిద్దం చేసుకుంది. ఈ టోర్నీ మొత్తంలో అంటే సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 10 వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలు నిర్వహించానున్నారు. విరాట్‌ కోహ్లీ, మహేంద్రసింగ్‌ ధోనీ, రోహిత్‌ శర్మ, ధావన్ తో పాటుగా 50 మంది క్రికెటర్ల నమూనాలను సేకరించనున్నారు.

ఐపీఎల్‌లో డోపింగ్‌ కార్యకలాపాలను అడ్డుకొనేందుకు గాను నాడా మొత్తం ఐదు 'డోప్‌ నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. మ్యాచ్ లు జరిగే ప్రదేశాలు అయిన దుబాయ్‌, షార్జా, అబుదాబి స్టేడియాల్లో మూడు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది.. ఇక ఆటగాళ్లు సాధన చేసే ఐసీసీ అకాడమీ, జాయెద్‌ క్రికెట్‌ స్టేడియాల్లో మిగతా రెండు కేంద్రాలను ఏర్పాటు చేయనుంది.. మొత్తం ఐదుగురు సభ్యులతో కూడిన మూడు బృందాలను నాడా నియమించనుంది. నాడా సీనియర్‌ అధికారి, డీసీవో కేంద్రాల నుంచి ఇద్దరు, యూఏఈ యాంటీడోపింగ్ సభ్యులు ఇద్దరు ఇందులో సభ్యులుగా ఉండనున్నారు. విడతలవారీగా ఈ బృందాలు యూఏఈ చేరుకొని పరీక్షలు చేయనున్నాయి..

దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి.. మొత్తం 53 రోజుల పాటు 60 మ్యాచ్‌ లు జరగనున్నాయి.. కరోనా నేపద్యంలో జరుగుతున్న సీజన్ కావడంతో ఆటగాళ్ళను నెల రోజుల ముందే అక్కడికి చేర్చాలని ఫ్రాంఛైజీలకి బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.. ఇక ఇప్పటికే అక్కడికి అన్ని జట్లు చేరుకోనున్నాయి. 

Tags:    

Similar News