ముంబై తడబడుతోంది. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచులో.. బేటింగ్ ఆర్డర్ దెబ్బతింటోంది. మొదట్లో ధాటిగా బ్యాటింగ్ మొదలు పెట్టి వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ముంబై కొద్దిసేపు మందకొడిగా ఆది వికెట్లను కాపాడుకుంది. కానీ, 13వ ఓవర్ వచ్చేసరికి మరో రెండు వికెట్లను వరుసగా కోల్పోయి తడబడుతోంది.
చెన్నైతో జరుగుతున్న ఫైనల్ మ్యాచులో ముంబయి ఇండియన్స్ మరోసారి వెంటవెంటనే వికెట్లు చేజార్చుకుంది. 13 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ (15; 17 బంతుల్లో 1×4)ను ఇమ్రాన్ తాహిర్ ఔట్ చేశాడు. 11.2వ బంతిని ఆడబోయి ఇన్‌సైడ్ ఎడ్జ్ కావడంతో యాదవ్ బౌల్డ్ అయ్యాడు. అతడి నిష్ర్కమణతో క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్య (7; 7 బంతుల్లో) శార్దూల్ ఠాకూర్ వేసిన 12.3వ బంతికి ఔటయ్యాడు. గాల్లోకి లేచిన బంతిని ఠాకూర్ చాలా దూరం పరుగెత్తి అద్భుతంగా అందుకున్నాడు. ఇషాన్ కిషన్ (21; 21 బంతుల్లో 3×4) ఆచితూచి ఆడుతున్నాడు. కీరన్ పొలార్డ్ క్రీజులోకి వచ్చాడు.అద్భుతమైన ఫీల్డింగ్.. బౌలింగ్ లతో చెన్నై ఆకట్టుకుంటోంది.