ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వరల్డ్ కప్ నుండి ధోని రిటైర్మెంట్ వార్తలు మొదలు అయ్యాయి . వరల్డ్ కప్ అనంతరం ధోని రిటైర్ అవ్వడం ఖాయమని అందరు భావించారు . దీనికి తోడు ధోని అటతీరు కూడా తోడవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది . దీనిపైన ధోని కూడా ఏనాడూ స్పందించింది కూడా లేదు . అయితే తాజాగా మళ్ళీ ధోని రిటైర్మెంట్ వార్తలు తెర పైకి వచ్చాయి .ధోని ఈ రోజు రాత్రి ఏడూ గంటలకు ప్రెస్ మీట్ పెడతాడని అందులో తన రిటైర్మెంట్ పై ప్రకటిస్తాడని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీటిపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ని ఈరోజు మీడియా ప్రశ్నించగా ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం అందలేదు. ధోనీ ఈరోజు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడనే వార్త నన్ను ఆశ్చర్యపరుస్తోందని అయన అని వెల్లడించారు. ఈరోజు దక్షిణాప్రికాతో మూడు టెస్టుల సిరీస్ కి సంబంధించి మొత్తం 15 మందితో కూడిన టీం ని సెలెక్ట్ చేసారు . ఇందులో ధోనిని ఎంపీక చేయలేదు.