MS Dhoni's next plan: రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో చెన్నై టీమ్‌లోకి మరో ఆటగాడిని తీసుకొస్తున్న ధోనీ?
Ruturaj Gaikwad will be replaced by whom in CSK: రుతురాజ్ గైక్వాడ్ ఐపిఎల్ 2025 కు దూరమవడంతో అతడి స్థానంలో మరో ఆటగాడిని...

MS Dhoni's next plan: రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో చెన్నై టీమ్‌లోకి మరో ఆటగాడిని తీసుకొస్తున్న ధోనీ?
CSK vs KKR match today: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేప్టేన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా ఐపిఎల్ 2025 కు దూరం అవుతున్నట్లు ఆ ఫ్రాంచైజీ ప్రకటించిన విషయం తెలిసిందే. రుతురాజ్ స్థానంలో ఇకపై జరిగే మిగతా అన్ని మ్యాచులకు మహేంద్ర సింగ్ ధోనీనే కేప్టేన్‌గా వ్యవహరిస్తారని చెన్నై జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నిన్న గురువారమే మీడియాకు వెల్లడించాడు.
రుతురాజ్ గైక్వాడ్ ఐపిఎల్ 2025 కు దూరం అవడంతో అతడి స్థానంలో మరో ఆటగాడిని తీసుకొచ్చేందుకు ధోనీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ ఆటగాడు ఎవరో కాదు... గతేడాది ఐపిఎల్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుపున ఆడిన పృధ్వీ షా. పృధ్వీ బేస్ ప్రైస్ రూ. 75 లక్షలుగా ఉంది. కానీ ఈ ఐపిఎల్ 2025 వేలంలో పృధ్వీ షాను ఎవ్వరూ తీసుకోలేదు. దీంతో షా అన్‌సోల్డ్ ప్లేయర్‌గా మిగిలిపోయాడు.
గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరుపున 8 మ్యాచ్‌లు ఆడిన పృధ్వీ షా మొత్తం 198 పరుగులు చేశాడు. పృధ్వీ షా ఓవర్ ఆల్ ఐపిఎల్ కేరీర్ విషయానికొస్తే, ఇప్పటివరకు 99 ఐపిఎల్ మ్యాచ్‌లు ఆడిన పృధ్వీ షా మొత్తం 1892 పరుగులు చేశాడు. అందులో 14హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐపిఎల్ 2025 ప్రారంభం అవడానికి ముందు గత నెలలో ముస్సోరీలో రిషబ్ పంత్ సోదరి పెళ్లిలో పృధ్వీ షా ధోనీని కలిశాడు. అలా తనతో టచ్‌లో ఉన్న పృధ్వీని ధోనీ గుర్తుపెట్టుకుని ఇప్పుడు అతడిని జట్టులోకి తీసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అధికారికంగా ప్రకటిస్తేనే అసలు విషయం ఏంటో తెలుస్తుంది.
చెన్నై vs కోల్‌కతా మ్యాచ్
ఇవాళ శుక్రవారం రాత్రి 7:30 గంటలకు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య విన్నింగ్ ప్రాబబిలిటీ విషయానికొస్తే.. కోల్‌కతా నైట్ రైడర్స్ గెలవడానికి 55% అవకాశాలు ఉంటే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలిచేందుకు 45% ప్రాబబిలిటీ మాత్రమే ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి.
ఐపిఎల్ 2025 లో చెన్నై స్థానం ఎక్కడుంది?
ఇక ఐపిఎల్ 2025 పాయింట్స్ పట్టికలో ఇరు జట్ల స్థానాల విషయానికొస్తే, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 4 పాయింట్స్‌తో 6వ స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కేవలం 2 పాయింట్స్‌తో 9వ స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ జరిగే మ్యాచ్‌లో ( CSK vs KKR ) చెన్నై జట్టు మెరుగైన రన్ రేట్ తో గెలిస్తేనే పాయింట్స్ పట్టికలో ఏమైనా పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. లేదంటే, ప్లే ఆఫ్స్‌లో ఏం జరుగుతుందో ఇక మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఈ ఐపిఎల్ 2025 పాయింట్స్ టేబుల్‌లో (IPL 2025 points table) సన్ రైజర్స్ హైదరాబాద్ అత్యల్ప నెట్ రన్ రేట్‌తో అట్టడుగున 10వ స్థానంలో ఉంది.