KL Rahul Birthday:15 ఏళ్ల వయసులో కేఎల్ రాహుల్ చేసిన పనికి తల్లి ఎందుకు మాట్లాడటం మానేసిందో తెలుసా?
KL Rahul Birthday: ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈసారి రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తను బరిలోకి దిగారు.

KL Rahul Birthday: ప్రస్తుతం కేఎల్ రాహుల్ ఐపీఎల్ 2025లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈసారి రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ తరపున తను బరిలోకి దిగారు. కొత్త సీజన్‌లో కొత్త ఫ్రాంచైజీ కోసం తన శాయశక్తులా పని చేస్తున్నాడు. అయితే, అతని తల్లి కొంత కాలం క్రితమే తనతో మాట్లాడడం మానేసింది. ఏప్రిల్ 18, 2025న 33 ఏళ్లు పూర్తి చేసుకున్న కేఎల్ రాహుల్ జీవితానికి సంబంధించిన ఒక పెద్ద నిజం ఇది.కాకపోతే ఇది ఇప్పటి విషయం కాదు. అతను క్రికెట్ లో ప్రాథమికాంశాలు నేర్చుకుంటున్న రోజుల నాటిది. కేవలం 15 సంవత్సరాల వయస్సులో రాహుల్ చేసిన ఒక పని అతని తల్లికి నచ్చలేదు. ఆమె కేఎల్ రాహుల్ తో మాట్లాడటం ఆపేసింది.
కేఎల్ రాహుల్‌కు చిన్నప్పటి నుంచే ఆటలంటే చాలా ఇష్టం. అతను అన్ని రకాల ఆటలు ఆడేవాడు. రాహుల్ తండ్రి కేఎన్ లోకేష్, తల్లి రాజేశ్వరి ఇద్దరూ విద్యా రంగంలో ఉండేవారు. తండ్రి అయితే సునీల్ గవాస్కర్ కు పెద్ద అభిమాని. అందువల్ల తన కొడుకు ఆడుకుంటుంటే ఎప్పుడూ వద్దనలేదు. అయితే, వారికి ఒక షరతు ఉండేది. రాహుల్ ఆట అతని చదువుపై ప్రభావం చూపకూడదని వారు చెప్పేవారు. ఒకవేళ చదువులో మార్కులు తగ్గితే అతను ఆటలు ఆపేయాల్సి ఉంటుంది. కేఎల్ రాహుల్ తన తల్లిదండ్రుల ఈ షరతును అంగీకరించి తన జీవితంలో ఆట, చదువు రెండింటినీ అద్భుతంగా సమతుల్యం చేసుకున్నాడు.
కొడుకు ఆట, చదువు రెండింటినీ బాలెన్స్ చేసుకున్నప్పుడు, కాలేజీలో హిస్టరీ బోధించే అతని తల్లికి ఎందుకు ఇబ్బంది ఉంటుందని ఆలోచిస్తున్నారా.. 15 సంవత్సరాల వయస్సులో కొడుకు చేసిన తప్పు ఆ తల్లికి కోపం తెప్పించింది. క్రికెట్‌లో రాహుల్ ద్రవిడ్‌ను తన ఆదర్శంగా భావించే కేఎల్ రాహుల్‌కు చిన్నప్పటి నుంచే స్టైల్‌గా ఉండటం అంటే చాలా ఇష్టం. క్రికెట్‌లో అతని హీరో రాహుల్ ద్రవిడ్ అయినట్లే, స్టైల్ ఐకాన్ ఇంగ్లాండ్ గొప్ప ఫుట్‌బాలర్ డేవిడ్ బెక్‌హామ్.
తల్లి మాట్లాడటం ఆపేయడానికి కారణం అదే
కేఎల్ రాహుల్ శరీరంపై మీరు చూసే టాటూలన్నీ అతనిపై ఉన్న డేవిడ్ బెక్‌హామ్ అభిమానం ప్రభావమే. రాహుల్ 15 సంవత్సరాల వయస్సు నుంచే శరీరంపై టాటూలు వేయించుకోవడం ప్రారంభించాడు. అదే వయస్సులో అతను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా మొదటి టాటూ వేయించుకున్నాడు. విద్యా రంగంలో ఉన్న అతని తల్లికి ఈ విషయం తెలిసినప్పుడు ఆమె చాలా కోపం తెచ్చుకుంది. ఆమె రాహుల్‌తో చాలా కాలం పాటు మాట్లాడటం కూడా మానేసింది.