Team India: తమ్ముళ్లూ.. ఇది రాసిపెట్టుకోండి.. టీమిండియా భవిష్యత్‌ కెప్టెన్‌ అతనే..!

Team India: వాస్తవానికి కోచ్.. ఆఫ్ ద ఫీల్డ్ స్ట్రాటజీ మాత్రమే ఇవ్వగలడు. ఈ మాత్రం సెన్స్‌ లేని చాలా మంది ఏకంగా కెప్టెన్‌ను పక్కనపెట్టి మరీ కోచ్‌గారికే క్రెడిట్లు ఇచ్చారు.

Update: 2025-04-17 12:41 GMT
Team India: తమ్ముళ్లూ.. ఇది రాసిపెట్టుకోండి.. టీమిండియా భవిష్యత్‌ కెప్టెన్‌ అతనే..!

Team India: తమ్ముళ్లూ.. ఇది రాసిపెట్టుకోండి.. టీమిండియా భవిష్యత్‌ కెప్టెన్‌ అతనే..!

  • whatsapp icon

Team India: ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య... బుల్లెట్ దిగిందా లేదా... అన్నదే పాయింట్! టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్‌ ఈ మహేష్ బాబు డైలాగ్ చక్కగా సరిపోతుంది. మొన్నటివరకు అసలు టీంలో స్పాట్ ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి నుంచి.. టీమిండియా కెప్టెన్‌గా మాకు నువ్వే కావాలని ఫాన్స్ కోరుకునే స్థాయికి ఎదిగాడు అయ్యర్. ఇటు హార్డ్ వర్క్‌తో టీమిండియాలో చోటు తిరిగి సంపాదించడమే కాకుండా.. ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపులోనూ కీలక పాత్ర పోషించాడు. అ తర్వాత ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అయ్యర్‌... పంజాబ్ కింగ్స్ సారథిగా దుమ్మురేపుతున్నాడు. బ్యాటర్‌గా ఓవైపు రాణిస్తూనే.. మరోవైపు కెప్టెన్‌గా మంచి మార్కులు కొట్టేస్తున్నాడు అయ్యర్.

ఇటు కోల్‌కోతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 112 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ డిఫెండ్ చేసుకుంది. ఇందులో సింహ భాగం క్రెడిట్ దక్కాల్సింది శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీకి మాత్రమే. ఫీల్డ్ ప్లేసెమెంట్స్, బౌలర్లను రొటేట్ చెయ్యడం లాంటి ట్రిక్స్‌తో కేకేఆర్‌ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు అయ్యర్. ఇక అతని గురించి డగౌట్‌లో ఉన్న కోచ్ రికీ పాంటింగ్ ఏం చెప్పాడో తెలిస్తే.. అయ్యర్‌ ఎంత ఎదిగిపోయాడో అర్థం చేసుకోవచ్చు. తన జీవితంలో ఇలాంటి మ్యాచ్‌ను ఎక్స్‌పీరియన్స్ చెయ్యలేదని పాంటింగ్‌ ఇచ్చిన కంప్లిమెంట్ అదిరిందనే చెప్పాలి. నిజానికి 2024లో నాడు కోల్‌కతా కెప్టెన్‌గా ఉన్న అయ్యర్‌.. ఆ టీమ్‌కు కప్‌ సాధించాడు. అయితే క్రెడిట్ అంతా గంభీర్‌కి వెళ్ళిపోయింది. వాస్తవానికి కోచ్.. ఆఫ్ ద ఫీల్డ్ స్ట్రాటజీ మాత్రమే ఇవ్వగలడు. ఈ మాత్రం సెన్స్‌ లేని చాలా మంది ఏకంగా కెప్టెన్‌ను పక్కనపెట్టి మరీ కోచ్‌గారికే క్రెడిట్లు ఇచ్చారు.

అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ కోల్‌కతా ఫ్రాంచైజీ అయ్యర్‌ను వదులుకుంది. ఇక ఒకరి దురదృష్టం మరొకరికి అదృష్టం అన్నట్టు... ప్రీతి జింతా పాలిట వరంగా మారాడు అయ్యర్. పంజాబ్ కింగ్స్ జట్టులో ఇట్టే ఇమిడిపోయాడు. కెప్టెన్ అంటే వీడే రా... అని తన తోటి టీమ్‌మేట్స్‌తో శభాష్‌ అనిపించుకున్నాడు. ఇండియన్ క్రికెట్ అభిమానులు కూడా రోహిత్ తర్వాత నువ్వే మా కెప్టెన్‌గా ఉండాలి భయ్యా అంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రోహిత్‌ మాత్రం 2027 వన్డే వరల్డ్‌కప్‌ వరకు ఆడుతానని శపథం చేశాడు. కానీ అప్పటివరకు రోహిత్‌ కొనసాగుతాడా అంటే ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి. ప్రస్తుత పరిస్థితుల్లో రోహిత్ ఫామ్‌ చూస్తుంటే 2027 వరకు అతను కొనసాగడం కష్టమేమో అనిపిస్తోంది. ఎందుకంటే.. ఫామ్‌ ఈజ్ టెంపరరీ.. క్లాస్ ఈస్ పెర్మనెంట్ లాంటి కొటేషన్స్ ఒకప్పుడు బాగుండేవేమో కానీ.. ఇప్పుడు మాత్రం రన్స్ తప్ప వేరే ఏది కూడా భారత జట్టులో స్థానాన్ని కంఫర్మ్ చెయ్యడం లేదు. దీనికి కారణం... కాంపిటీషన్. రోహిత్ శర్మ వెళ్ళిపోతే.. ఆ ప్లేస్‌ను భర్తీ చేస్తానంటూ ఊర్రూతలూగుతున్న కుర్ర క్రికెటర్‌లు చాలా మంది ఉన్నారు. అందులో అయ్యర్‌ అందరికంటే ముందన్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు.


keywords: IPL 2025, shreyas iyer, PBKS, rohit sharma, BCCI

Tags:    

Similar News