Dewald Brevis joining CSK: సౌతాఫ్రికా క్రికెటర్‌కు చెన్నై సూపర్ కింగ్స్ పిలుపు

Dewald Brevis joining CSK: సౌతాఫ్రికా క్రికెటర్‌కు చెన్నై సూపర్ కింగ్స్ పిలుపు
Dewald Brevis to join CSK: చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సౌతాఫ్రికా క్రికెటర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కష్టాల్లో ఉన్న తమ జట్టును ఆదుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ సాతాఫ్రికా బ్యాటర్‌ను పిలిపించింది. గాయంతో ఆటకు దూరమైన గుర్జప్‌నీత్ సింగ్ స్థానంలో యువ క్రికెటర్ బ్యాట్ పట్టుకోబోతున్నాడు. దీంతో క్షణాల్లోనే ఇప్పుడు ఇదొక హాట్, ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది.
ఆ సౌతాఫ్రికా క్రికెటర్ మరోవరో కాదు... డెవాల్డ్ బ్రెవిస్. ప్రస్తుతం 21 ఏళ్ల వయస్సులోనే 81 టీ20 మ్యాచ్‌ల్లో మొత్తం 1787 పరుగులు చేసిన అనుభవం అతడి సొంతం. అందులో 162 హైయెస్ట్ స్కోర్ ఉందంటే అతడి బ్యాటింగ్ సత్తా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్‌ను మిడిల్ ఆర్డర్ బలంగా లేకపోవడం సమస్యగా మారింది. అయితే, ఆ స్థానాన్ని డెవాల్డ్ బ్రూయిస్ కవర్ చేస్తాడని చెన్నై ఫ్రాంచైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
2022 ఐసిసి అండర్ 19 పురుషుల వరల్డ్ కప్ సమయంలో బ్రెవిస్ తొలిసారిగా హైలైట్ అయ్యాడు. కేవలం 6 ఇన్నింగ్స్‌లోనే 506 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆ మరుసటి ఏడాదే సౌతాఫ్రికా టీ20 జట్టులోనూ చోటు సంపాదించుకున్నాడు.
డెవాల్డ్ బ్రెవిస్ బ్యాటింగ్ చూసి ఫిదా అయిన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ అతడిని తమ ఐపిఎల్ జట్టులోకి తీసుకుంది. అయితే, ఐపిఎల్ 2025 వేలానికి ముందు బ్రెవిస్‌ను ముంబై ఇండియన్స్ రీటేన్ చేసుకోకుండా రిలీజ్ చేసింది. అప్పటికీ అతడి బేస్ ప్రైస్ రూ. 75 లక్షలు. బేస్ ప్రైస్ ఎక్కువగా ఉండటం వల్లో లేక మరో కారణం వల్లో తెలియదు కానీ ఏ జట్టు అతడిని తీసుకోలేదు. కానీ బ్రెవిస్‌పై నమ్మకంతో ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ అతడిని జట్టులోకి స్వాగతం పలుకుతోంది. అందుకోసం చెన్నై జట్టు బ్రెవిస్‌కు రూ. 2.2 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా కథనం చెబుతోంది.