IPL 2025: 5 ఓటములు.. అయినా సన్‌రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవం!

IPL 2025: ముంబై ఇండియన్స్‌తో ఏప్రిల్ 17న జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ 2025లో ఇది 5వ ఓటమి.

Update: 2025-04-18 06:08 GMT
SRHs Playoff Hopes Alive Despite 5th Loss in IPL 2025

IPL 2025: 5 ఓటములు.. అయినా సన్‌రైజర్స్ ప్లేఆఫ్ ఆశలు సజీవం!

  • whatsapp icon

IPL 2025: ముంబై ఇండియన్స్‌తో ఏప్రిల్ 17న జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ 2025లో ఇది 5వ ఓటమి. అంటే ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో SRH 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయితే ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశం ఇంకా ఉంది. 5 మ్యాచ్‌లు ఓడిపోయినప్పటికీ, ఈ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంది. క్రికెట్‌లో ఒక సామెత ఉంది కదా, చివరి బంతి పడే వరకు ఆట ముగిసినట్లు భావించకూడదు అని. సన్‌రైజర్స్ హైదరాబాద్ విషయంలోనూ అలాంటి పరిస్థితే ఉంది. ఐపీఎల్ 2025లో ఆడిన మొదటి 7 మ్యాచ్‌ల్లో 5 ఓడిపోయారు. కానీ ఇంకా 7 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.. ఆ మ్యాచులు ఆ జట్టును ప్లే ఆఫ్ కు చేర్చగలవు.

మొదటి 7 మ్యాచ్‌ల్లో 5 ఓడినా.. SRH ప్లేఆఫ్‌కు ఎలా చేరుకుంటుంది?

ఐపీఎల్ 2025 గ్రూప్ స్టేజ్‌లో అన్ని జట్లు 14 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అందులో దాదాపు అందరూ 7 మ్యాచ్‌లు ఆడేశారు. మొదటి 7 మ్యాచ్‌ల్లో 5 ఓటముల తర్వాత పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి దయనీయంగా ఉంది. 10 జట్ల ఈ లీగ్‌లో వారు ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నారు. అయితే, టాప్ ఫోర్‌కు చేరుకునే మార్గం ఇప్పటికే తెరిచే ఉంటుంది. మరి అక్కడికి ఎలా చేరుకుంటారనేది ప్రశ్న.

SRH ప్లేఆఫ్స్‌కు చేరాలంటే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ ఫోర్‌లోకి వెళ్లడానికి మిగిలిన 7 మ్యాచ్‌ల్లో అన్నింటినీ గెలవడానికి ప్రయత్నించాలి. అలా జరగకపోతే, వారు కనీసం 7 మ్యాచ్‌ల్లో 6 గెలవాలి. అది లేకుండా ప్లే ఆఫ్ చేరడం కష్టం. మొదటి 7 మ్యాచ్‌ల్లో 2 గెలిచి వారి ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి. తర్వాతి 7 మ్యాచ్‌ల్లో 6 గెలిస్తేనే వారికి 12 పాయింట్లు వస్తాయి, మొత్తం కలిపితే 16 పాయింట్లు అవుతాయి. గ్రూప్ స్టేజ్‌లో 16 పాయింట్లు సాధిస్తే ప్లేఆఫ్ టిక్కెట్‌ దక్కుతుంది.

పని కష్టమే కానీ అసాధ్యం కాదు. మిగిలిన 7 మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ 3 మ్యాచ్‌లు వారి హోమ్ గ్రౌండ్ హైదరాబాద్‌లో ఆడాల్సి ఉంది. సొంతగడ్డపై మ్యాచ్ అంటే భయం ఎందుకు అని అనడానికి బాగానే ఉంటుంది. కానీ మొదటి 7 మ్యాచ్‌ల్లో ఈ జట్టు హైదరాబాద్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో 2 గెలిచింది.. 2 ఓడిపోయింది. అంటే పరిస్థితి 50-50గా ఉంది. అలాంటప్పుడు ఆ జట్టు అడుగు జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది. తర్వాతి 7 మ్యాచ్‌ల్లో 3 హైదరాబాద్‌లో ఉంటే, మిగిలిన 4 మ్యాచ్‌లు చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నోలో జరగనున్నాయి. సవాలు సులభం కాదని స్పష్టంగా తెలుస్తోంది. కానీ రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన సన్‌రైజర్స్‌కు ఇది అసాధ్యం కాదు.

Tags:    

Similar News