ధర్మేందర్, సన్నీ, బాబీ... ఈ ఐపిఎల్ క్రేజీ స్పిన్నర్‌కు బాలీవుడ్ ఫ్యామిలీకి కనెక్షన్ ఏంటో తెలుసా?

ధర్మేందర్, సన్నీ, బాబీ... ఈ ఐపిఎల్ క్రేజీ స్పిన్నర్‌కు బాలీవుడ్ ఫ్యామిలీకి కనెక్షన్ ఏంటో తెలుసా?
Digvesh Rathi's interesting personal story: ఇక్కడ మనం ఫోటోలో చూస్తోన్న ఈ క్రికెటర్ ఎవరో గుర్తుపట్టారు కదా... యస్ లక్నో సూపర్ జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేష్ రతి. లక్నో సూపర్ జెయింట్స్ vs ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో దిగ్వేష్ రతి పర్‌ఫార్మెన్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ వరించింది. 4 ఓవర్లు వేసిన దిగ్వేష్ 1/21 తో 5.25 ఎకానమి రేట్‌తో రాణించాడు. ఈ మ్యాచ్‌లో శార్ధూల్ థాకూర్, ఆకాష్ దీప్, రవి బిష్ణోయ్ లాంటి తోటి సీనియర్స్ కనీసం 40 పరుగులు సమర్పించుకుని ఎక్కడో వెనుకుండిపోయారు.
దిగ్వెష్‌కు ఇదే తొలి ఐపీఎల్ సీజన్. ఢిల్లీకి చెందిన దిగ్వేష్‌ను లక్నో ఫ్రాంచైజీ రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది. ఐపిఎల్‌లోకి అడుగుపెట్టిన తరువాత 4వ మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ కొట్టేశాడు.
దిగ్వేష్ విజయం వెనుక సోదరుడి త్యాగం
దిగ్వేష్ వాళ్ల అన్నయ్య సన్నీ కూడా క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. సన్నీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. కానీ దిగ్వేష్ తండ్రి ధర్మేందర్ మాత్రం ఇద్దరికి క్రికెట్ కోచింగ్ ఇప్పించేంత స్తోమత తనకు లేదన్నారు. బిల్డింగ్ మెటీరియల్స్ విక్రయించే ఒక దుకాణంలో అసిస్టెంట్ పని చేసుకుంటూనే దిగ్వేష్ కు క్రికెట్ కోచింగ్ ఇప్పించారు. తమ్ముడిని క్రికెటర్‌గా చూసినా చాలులే అని భావించిన అన్నయ్య , తమ్ముడి కెరీర్ కోసం తన కలలను త్యాగం చేశారు. తను క్రికెటర్ అవ్వాలనుకున్న ఆశయాన్ని వదిలేసి తమ్ముడికే కోచింగ్ ఇప్పించారు. దాని ఫలితమే ఇవాళ దిగ్వేష్‌ను ఇలా చూస్తున్నాం అని ఆ కుటుంబం ఆనందబాష్పాలు రాల్చుతోంది. దిగ్వేష్ ఆటను టీవీల్లో ఎంజాయ్ చేస్తూ
అన్నట్లు దిగ్వేష్ తండ్రి ధర్మేందర్ బాలీవుడ్ నటుడు ధర్మేందర్ కు వీరాభిమాని. అందుకే ఆయన తన అభిమాన నటుడి కుటుంబానికి తగినట్లుగానే తనకు పుట్టిన పిల్లల్లో పెద్ద కొడుక్కు సన్నీ అని, రెండో కొడుక్కు బాబీ అని పేరు పెట్టుకున్నారు. దిగ్వేష్ రతి ముద్దు పేరే బాబీ.