Viral Video: ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చివరి క్షణంలో గోల్డ్ మెడల్ పోగొట్టుకున్న నితిన్

Update: 2025-04-16 14:26 GMT
Indian athlete Nitin Gupta loses 5000m racewalk athletics gold medal due to early celebrations in Asian Championships

ఓవర్ కాన్ఫిడెన్స్‌తో చివరి క్షణంలో గోల్డ్ మెడల్ పోగొట్టుకున్న నితిన్ గుప్త

  • whatsapp icon

Indian athlete lost gold medal due to early celebrations

Indian athlete lost gold medal due to early celebrations: ముందుగ మురిసినమ్మ పండగ ఎరుగదని తెలుగులో ఒక సామెత ఉన్న విషయం తెలిసిందే. అంటే ఏదైనా పని పూర్తి కాకముందే లేదా విజయం సాధించకముందే ఎర్లీగా సెలబ్రేట్ చేసుకోవద్దనేది ఆ మాటకు ఉన్న అర్థం. ఎందుకంటే, చివరి క్షణంలో కూడా ఫలితం తారుమారయ్యే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అలాంటిదే జరిగితే, సెలబ్రేట్ చేసుకున్న తరువాత అపజయం చూడాల్సి వస్తుంది. అలాంటప్పుడు చూసే వారి ముందు ఫూల్స్ గా మిగిలిపోతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్లు అనుకుంటున్నారా?

అయితే, ఇదిగో ఈ వీడియో చూడండి అసలు విషయం ఏంటో మీకే అర్థం అవుతుంది. సౌది అరేబియాలో U-18 ఏషియన్ ఛాంపియన్‌షిప్స్ పోటీలు జరిగాయి. అందులో 5000 మీటర్ల రేస్‌వాక్ కేటగిరీలో గోల్డ్ మెడల్ గెలవాల్సిన ఇండియన్ అథ్లెట్ నితిన్ గుప్తా ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా చివరి క్షణంలో రేసులో ఓడిపోయి సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

తానే గెలిచాననే ధీమాతో ముందస్తు సంబరాల్లో మునిగిపోయిన నితిన్ గుప్త గోల్డ్ మెడల్ చేజార్చుకున్న తీరు మనం ముందుగా చెప్పుకున్న సామెతను గుర్తుచేస్తోంది. పని పూర్తి చేయకముందే సంబరాలు చేసుకునే వారిని ఉద్దేశించి అనే మాట నితిన్ గుప్త విషయంలో నిజమైంది. 

Tags:    

Similar News