MS Dhoni: కూల్ కెప్టెన్‌కు కోపం వస్తే అంతే సంగతులు.. ధోనీ ఆగ్రహానికి కారణమైన హోటల్ ఇదే!
MS Dhoni: మైదానంలోనూ, వెలుపల కూడా తన ప్రశాంతమైన వ్యక్తిత్వానికి పేరుగాంచిన ఎంఎస్ ధోనీ ఒకసారి ఒక హోటల్‌పై తీవ్ర అసంతృప్తి చెందాడు.

MS Dhoni: కూల్ కెప్టెన్‌కు కోపం వస్తే అంతే సంగతులు.. ధోనీ ఆగ్రహానికి కారణమైన హోటల్ ఇదే!
MS Dhoni: మైదానంలోనూ, వెలుపల కూడా తన ప్రశాంతమైన వ్యక్తిత్వానికి పేరుగాంచిన ఎంఎస్ ధోనీ ఒకసారి ఒక హోటల్‌పై తీవ్ర అసంతృప్తి చెందాడు. ఎంతలా అంటే ఏకంగా ఆ హోటల్ నుండి వేరే హోటల్‌కు మారిపోయాడు.ఈ ఆసక్తికరమైన విషయాన్ని ధోనీ మాజీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సహచరుడు డ్వేన్ స్మిత్ ఒక వీడియో ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియో ప్రారంభంలో హోస్ట్ డ్వేన్ స్మిత్‌ను తాను ప్రాతినిధ్యం వహించిన రెండు ఐపీఎల్ ఫ్రాంచైజీలలో - ముంబై ఇండియన్స్ లేదా చెన్నై సూపర్ కింగ్స్ - దేనిని ఎంచుకుంటారని అడిగాడు. స్మిత్ ప్రశ్న పూర్తి కాకముందే వెంటనే "చెన్నై సూపర్ కింగ్స్" అని సమాధానమిచ్చాడు.
ఎందుకు అని అడిగినప్పుడు స్మిత్ ఇలా వివరించాడు, "అది అలా ఉంటుంది. నాకు ముంబై కూడా ఇష్టం. కానీ చెన్నైలో ఉన్న అనుభూతి వేరు. ధోనీ బాస్ అక్కడ ఉండటం వల్ల. నా అబ్జర్వేషన్ ప్రకారం.. ధోనీ తనతో పనిచేసే ప్రతి ఆటగాడిని అర్థం చేసుకోవాలని అనుకుంటాడు. మీరు అతనికి కోపం తెప్పిస్తే, మీరు నిజంగా చాలా దారుణమైన పని చేసి ఉండాలి." ఆసక్తిగా, హోస్ట్ అప్పుడు "మీరు ధోనీని కోపంగా చూశారా?" అని అడిగాడు.
స్మిత్ అప్పుడు తాను సాధారణంగా ప్రశాంతంగా ఉండే ధోనీ తన సహనం కోల్పోయిన రెండు ప్రత్యేక సంఘటనలను గుర్తు చేసుకున్నాడు. "అశ్విన్ ఒక క్యాచ్ వదిలేశాడు. అది చాలా సులభమైన క్యాచ్. ధోనీ అతన్ని స్లిప్ నుండి తీసివేసి వేరే చోట ఉంచాడు. నేను అతన్ని కోపంగా చూడటం అదే మొదటిసారి. మరోసారి, హోటల్ సిబ్బంది ధోనీ ఆర్డర్ చేసిన ఆహారాన్ని అతనికి డెలివరీ చేయకుండా ఆపేశారు. అతను కోపం తెచ్చుకుని వెంటనే ఆ హోటల్ నుండి వేరే హోటల్‌కు మారిపోయాడు. నాకు ఆ హోటల్ పేరు గుర్తులేదు, ఒకవేళ గుర్తు ఉన్నా నేను చెప్పను. అతను వెంటనే వేరే హోటల్‌కు వెళ్ళిపోయాడు," అని స్మిత్ వెల్లడించాడు.
ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో సీఎస్‌కేకు నాయకత్వం వహిస్తున్నాడు. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో ధోనీ తన వింటేజ్ ఫినిషింగ్ నైపుణ్యంతో అజేయంగా 26 పరుగులు చేశాడు. ఈ విజయంతో సీఎస్‌కే వరుసగా ఐదు ఓటముల పరంపరకు తెరపడింది. ధోనీ, శివమ్ దూబే (43*) అజేయమైన 57 పరుగుల భాగస్వామ్యంతో మూడు బంతులు మిగిలి ఉండగానే 167 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సహాయం చేశారు.
గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో జట్టుకు నాయకత్వం వహిస్తున్న ధోనీ 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 11 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అత్యంత కీలకమైన సమయంలో తాను ఇంకా మెరుపులు మెరిపించగలనని మరోసారి నిరూపించాడు. మ్యాచ్‌లో తన అద్భుతమైన ప్రదర్శనకు ధోనీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ అవార్డును అందుకున్న అత్యంత వృద్ధ ఆటగాడిగా నిలిచాడు. 43 సంవత్సరాల, 280 రోజుల వయస్సులో అతను ప్రవీణ్ తాంబే దీర్కాలిక రికార్డును అధిగమించాడు.